Tummala Nageswara Rao: తెలంగాణ ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగమే గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో విజన్ డాక్యుమెంట్‌పై ప్రజెంటేషన్ చేస్తూ ఆయన ఈ విషయాన్ని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతాంగం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లు వివరించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ విస్తరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, ప్రస్తుతం 3 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు ఉండగా, 10 లక్షల ఎకరాల్లో సాగే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు ఉండేలా పామాయిల్ సాగు విస్తరణ చేపట్టినట్లు, తద్వారా పర్యావరణ హితంగా పామాయిల్ సాగు గేమ్ చేంజర్‌గా మారుతుందని విజన్ డాక్యుమెంట్‌లో వివరించారు. తెలంగాణ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం దాని అనుబంధ ఆర్థిక వ్యవస్థ వాటా 34.6 బిలియన్లు ఉండగా, 2047 నాటికి దాని విలువ 400 బిలియన్లు చేరుతుందన్నారు. రేవంత్ నాయకత్వంలో గ్లోబల్ సమ్మిట్ రైతు రాజ్యం దిశగా బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Hydra Commissioner: సైదాబాద్ ఎర్రకుంటకు పూర్వ వైభవం తీసుకువస్తాం : హైడ్రా కమిషనర్ రంగనాధ్
డిజిటల్ స్మార్ట్ సాగు
సేంద్రీయ వ్యవసాయం పెరిగేలా కార్యాచరణతో ముందుకు పోతున్నామని, ఎకో, డిజిటల్ స్మార్ట్ సాగు దిశగా తెలంగాణ సాగుతోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ పరిశోధన, వాతావరణ-స్థితిస్థాపక సాగు పద్ధతులపై దృష్టి సారించే ఇంటిగ్రేటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం కోసం 5 ఎకరాల ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. థాయిలాండ్‌లో ఉన్న ప్రముఖ ఆయిల్ పామ్ సీడ్ ఉత్పత్తిదారు అయిన యూనివానిచ్ సహకారంతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళికలు తుది దశకు చేరుకుంటున్నాయని తెలిపారు. అదనంగా, 35 ఎకరాల స్థలంలో పూర్తిగా పనిచేసే ఆయిల్ పామ్ నర్సరీ స్థాపించబడిందని, ప్రస్తుతం దీని సామర్థ్యం 300,000 మొలకలు అని తెలిపారు. గతేడాది నుంచి పనిచేస్తున్న నర్సరీ, ప్రాంతీయ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బలమైన, అధిక దిగుబడినిచ్చే మొలకలని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గోద్రెజ్ ఆగ్రోబెట్ లిమిటెడ్ సీఈఓ సౌగత్ నియోగి, ఆయిల్ ఫాం బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ చావా వెంకటేశ్వరరావు, కార్పొరేట్ ఆపైర్స్ మీషికానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nari Nari Naduma Murari: సంక్రాంతి బరిలో దిగిన శర్వానంద్.. ‘బైకర్’తో మాత్రం కాదు..

