]Harish Rao: సర్పంచ్ ఎన్నికల రోజునే పరీక్ష సరికాదు
Harish Rao ( image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Harish Rao: సర్పంచ్ ఎన్నికల రోజునే పరీక్ష నిర్వహించడం సరికాదు : మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)రాత పరీక్షను నిర్వహించడం సరికాదని వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది శివ శేఖర్ ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం మంగళవానం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని న్యాయవాదులు కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 14 న రాత పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చారని, అయితే, అదే రోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుందన్నారు.

Also Read: Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలి

ఈ పరీక్షకు దాదాపు 4,000 మంది న్యాయవాదులు హాజరవుతున్నారని, పరీక్ష కేంద్రాలు హైదరాబాదులో ఉన్నాయి, కానీ అభ్యర్థుల ఓట్లు వారి సొంత గ్రామాల్లో ఉన్నాయని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజంతా పరీక్ష ఉండటంతో, అభ్యర్థులు తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధ్యం అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉండాలని, పరీక్ష పేరుతో న్యాయవాదులను ఓటింగ్ కు దూరం చేయడం అన్యాయం అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విషయంపై స్పందించి, డిసెంబర్ 14న జరగాల్సిన ఏపీపీ పరీక్షను మరో తేదీకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు.

Also Read: Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!