Telangana Electricity (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Electricity: రికార్డును బ్రేక్ చేసేలా విద్యుత్ వినియోగం.. ఎంత వాడారో తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Telangana Electricity: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగానికి తోడు వానా కాలం పంటల సీజన్​ తో ఈ పరిస్థితి ఏర్పడింది. గత యేడాది సెప్టెంబర్​ 20న 9,910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రికార్డును తాజాగా ఈనెల 8న 10,450 మెగావాట్ల వినియోగం బ్రేక్​ చేసింది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ(South Telangana Electricity Distribution System) సంస్థ ఛైర్మర్​, ఎండీ ముషారఫ్​ ఫరూఖీ(MD Musharraf Farooqui) మంగళవారం ఛీఫ్​ ఇంజనీర్లు, సూపరింటెండింగ్​ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఆయా జిల్లాల విద్యుత్​ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో..

విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. తాజాగా భారీగా వర్షాలు కురవటం, నీటి లభ్యత పెరగటంతో వానా కాలం పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో గత సంవత్పరంతో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 50 శాతానికి మించి నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం జరగవచ్చని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ(Nalgoanda) జిల్లాల్లో గత యేడాది సెప్టెంబర్​ 1న 13.6 మిలియన్​ యూనిట్లుగా ఉన్న వినియోగం ఈ సంవత్సరం అదే రోజున 33.82 మిలియన్​ యూనిట్లతో 148 శాతం అధికంగా నమోదైంది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన ఉ8న్నతాదికారులు దక్షిణ డిస్కం పరిధిలో ఏ యేడాది అదనంగా దాదాపు 26వేల డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్ ఫార్మర్ల(Distribution Transformers)ను మంజూరు చేశారు.

Also Read: Raashii Khanna: రాశీ ఖన్నా ఎమోషనల్ అయింది.. తెలుసు కదా!

క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ..

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 4.92లక్షల డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ ఫార్మర్లు పని చేస్తున్నాయి. వీటిలో సమస్యలు ఏర్పడితే వెంటనే మార్చేందుకు తప్పనిసరిగా ప్రతీ సర్కిల్​ పరిధిలో సరిపోయినన్ని డీటీఆర్(DTR) లను రోలింగ్​ స్టాక్ లో అందుబాటులో ఉంచేలా చూడాలని ముషారఫ్​ ఫరూఖీ అధికారులకు సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ విద్యుత్ సామాగ్రి స్టోర్స్​, ట్రాన్స్ ఫార్మర్​ రిపేరింగ్ సెంటర్లను విధిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్​ లో సంస్థ డైరెక్టర్లు నరసింహులు, శివాజీ, కృష్ణారెడ్డి, ఛీఫ్​ ఇంజనీర్లు, సూపరిండింటెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Also Read: Apple iPhones: ఐఫోన్ 15,16 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 20,000 తగ్గింపు

Just In

01

Indian Handicrafts: ఈ నెలలో భారతీయ చేతివృత్తుల మహోత్సవం.. ఎక్కడో తెలుసా..?

Shocking Incident: అందరూ చూస్తుండగానే.. కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్య మంత్రి.. వీడియో వైరల్

Bhadra Kaali Trailer: విజయ్ ఆంటొనీ భద్రకాళి ట్రైలర్ ఇదే.. సస్పెన్స్‌తో మరోసారి మన ముందుకు

Gold Rate Today: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Day Care Centers: క్యాన్సర్ నివారణ పై సర్కార్ ఫుల్ ఫోకస్.. అందుకు ప్రణాళికలు ఇవే..!