DGP Shivadhar Reddy: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్​
DGP Shivadhar Reddy (imagecredit:swetcha)
Telangana News

DGP Shivadhar Reddy: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్​ స్థానం: డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్​ స్థానంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి(డీజీపీ శివధర్ రెడ్డి) చెప్పారు. రావు బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్​ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీ(DSP)ల బ్యాచ్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ(Telangana) పోలీస్​ కుటుంబంలోకి అడుగు పెడుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో కూడిన అతి పెద్ద బ్యాచ్ ఇదే అని చెప్పారు. 10 నెలల శిక్షణా కాలం అత్యంత కీలకమైనదని చెప్పారు. ఈ సమయంలోనే మీరంతా వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. పోలీస్ అధికారి కేవలం చట్టాన్ని అమలు చేసే వ్యక్తి మాత్రమే కాదని చెప్పారు.

తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో..

చట్టం ఆత్మను అర్థం చేసుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. పోలీసులను ప్రజలు అధికారులుగా కాదు న్యాయ ప్రతినిధులుగా చూస్తారని చెప్పారు. శిక్షణ కఠినంగానే ఉంటుందన్నారు. అయితే, ఇది మీలో క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహాన్ని పెంచుతాయని చెప్పారు. డ్రిల్ వ్యాయామం శారీరక దృఢత్వాన్ని పెంచుతుందన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్, కౌంటర్​ ఇంటెలిజెన్స్​ సెల్​, తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber ​​Security Bureau), ఈగిల్ వంటి ప్రత్యేక విభాగాల పని తీరుతో తెలంగాణ పోలీస్​ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కమాండ్​ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్(She Teams)​, భరోసా కేంద్రాలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాలకు నిదర్శనాలని చెప్పారు.

Also Read: Duvvada Couple: దువ్వాడ జంట మంచి మనసు.. కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం.. మేమున్నామంటూ భరోసా!

గర్వకారణం

బ్యాచ్​‌లో 38 మంది మహిళా అధికారులు ఉండడం గర్వకారణమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు గౌరవం, సమానత్వం ఇక్కడి నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. ప్రవర్తన, నిజాయితీ, సహచరుల పట్ల సానుకూలత నిజమైన నాయకత్వ లక్షణాలని చెప్పారు. ప్రజల్లో తెలంగాణ పోలీసులపై అపారమైన విశ్వాసం ఉన్నదని, ఇది కష్టపడి సంపాదించుకున్నదని చెప్పారు. సేవతో గౌరవం పొందాలని సూచించారు. యూనిఫాం ధరించిన ప్రతీసారి విలువలు మీ ప్రవర్తనలో ప్రతిఫలించాలని చెప్పారు. పోలీస్​ అధికారికి నిజమైన అధికారం యూనిఫాంపై ఉండే నక్షత్రాల వల్ల రాదని, ప్రజల కళ్లల్లో కనిపించే విశ్వాసం వల్ల వస్తుందన్నారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ, పది నెలల శిక్షణకు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. మొదటి దశలో 42 వారాలపాటు ట్రైనింగ్ ఉంటుందన్నారు. సిలబస్ కాపీలను డీజీపీ శివధర్ రెడ్డి ఆవిష్కరించారు.

Also Read: CM Revanth Reddy: గెలుపు మనదే అయినా.. మెజారిటీ పై గురి పెట్టాల్సిందే కదా..!

Just In

01

Uttar Pradesh: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు.. టీచర్ మృతి

Bandi Sanjay: పంచాయతీలకు నిధులు.. ప్రభుత్వానికి బండి సంజయ్ డెడ్ లైన్

Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ 2025లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?..

School Bus Accident: మరో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. 60 మందికి పైగా విద్యార్థులు..!

Akhanda 2 JajiKayi Song: బాలయ్య బాబు ‘అఖండ 2’ నుంచి ‘జాజికాయ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..