Telangana officials In Hiroshima: హిరోషిమాను సందర్శించిన తెలంగాణ
Telangana officials In Hiroshima (imagecredit:twitter)
Telangana News

Telangana officials In Hiroshima: హిరోషిమాను సందర్శించిన తెలంగాణ బృందం.. అవకాశాలపై చర్చ!

తెలంగాణ: Telangana officials In Hiroshima: రాష్ట్ర ఖ్యముమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పరిశ్రమలు మరికయు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ అధికారుల బృందం జపాన్‌లోని హిరోషిమా ప్రి ఫెక్చర్ (రాష్ట్ర ప్రభుత్వం) ను సందర్శించింది. ఈ సందర్భంగా హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిరోషిమా ప్రభుత్వ ఆతిథ్యానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

Also Read: TG Inter Supplementary Exam: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారా? వెంటనే ఇలా చేయండి!

వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగు నీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా-తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ఆయన ప్రస్తావించారు.

వీటితో పాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు.

Also Read: BRS Kavitha: ఖమ్మంపై కవిత ఫోకస్.. పెద్ద ప్లానే అంటూ టాక్?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?