Voters List: మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని మున్సిపాలిటీలలో ఓటర్ జాబితాను ప్రచురించింది. రాష్ట్రంలో మొత్తం 51లక్షల 92 వేల 220 మంది ఉన్నట్లు ఈసీ పేర్కొంది. ఇందులో పురుషులు 25 లక్షల 37వేల 136 మంది, మహిళలు 26 లక్షల 54 వేల 453 మంది, ఇతరులు 631 మంది ఉన్నట్లు తెలిపింది.
సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్!
సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే కసరత్తును ఈసీ ప్రారంభించింది. రాష్ట్రంలోని 32 జిల్లాలలోని (6) మున్సిపల్ కార్పొరేషన్‌లోని (366) వార్డులకు, (117) మున్సిపాలిటీల్లోని (2,630)వార్డులకు, తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019లోని సవరించిన సెక్షన్ 195-ఏ ప్రకారం వార్డు వారీ ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రచురించింది.13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితాను ప్రచురించి, వాటిని టీ-పోల్ నందు అప్-లోడ్, 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటుగా ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్ల వారీగా సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల కమిషనర్లు ప్రచురిస్తారు.
Also Read: Twist in Death Case: టెకీ ఆత్మహత్య కేసు దర్యాప్తులో నమ్మలేని నిజాలు.. ఎదురింటి కుర్రాడే క్రిమినల్!
సన్నద్ధమవుతున్న పార్టీలు
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు క్యాడర్‌ను సన్నద్ధం చేస్తున్నాయి. పార్టీ అధినేతలు అన్ని జిల్లాల నేతలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అనుసరించిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వివరిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో విజయం లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను సిద్ధం చేస్తుంది. పట్టు నిలుపుకునేందుకు గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి నేతలకు దిశా నిర్దేశం చేస్తుంది. బీజేపీ సైతం తమకు పట్టున్న జిల్లాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
Also Read: Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

