SER Voter List: రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల జాబితాల స్పెషల్ ఇన్సెంటివ్స్ రివిజన్(సర్) తీసుకొచ్చింది. ఓటర్ల జాబితాలో అర్హులు ఉండేలా చర్యలు చేపట్టింది. అనర్హులుంటే తొలగించే ప్రక్రియను శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డు లింక్ తో సమగ్ర ఓటర్ లిస్ట్ తయారు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం ‘సర్’ ఓటర్ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు సైతం ఇచ్చింది. సమగ్ర వాటర్ జాబితా రూపకల్పనతో అధికారులను నిమగ్నం అవుతుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. సమగ్ర సమాచారంతోనే ఓటర్ లిస్ట్ ప్రకటించి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జనవరిలో కొత్త ఓటు నమోదు కార్యక్రమం సైతం ఉండడంతో దానిని సైతం పూర్తి చేసి తుది ఓటర్ లిస్ట్ ప్రకటన చేయబోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాతనే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు
రాష్ట్రంలో బోగస్ ఓట్లు లేకుండా.. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటరుగా నమోదైనట్లు ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం సైతం తీసుకొచ్చిన ‘సర్’ తో ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా ఆధార్ కార్డు లింకుతో ముందుకెళ్లబోతుంది. ఎవరైనా ఓటు తొలగించబడిన వారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నది. అర్హులకు మాత్రమే ఓటు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి( అక్రమ వలసదారులకు) దీంతో చెక్ పెట్టనుంది.
Also Read: K 4 Missile: ‘కే-4 మిసైల్’ను పరీక్షించిన భారత్.. దీని రేంజ్ ఏంటో తెలుసా?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల మినహా 31 జిల్లాల్లోని 565 మండలాలు ఉన్నాయి. 565 జెడ్పిటిసి స్థానాలు ఉండగా, 5749 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలకు నిర్వహించేందుకు అక్టోబర్ లోనే నోటిఫికేషన్ వెలువడగా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో వెళుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఎన్నికల నోటిఫికేషన్ ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే నిర్వహిస్తామని ఆశావాహులు భావించినప్పటికీ నిరాశే ఎదురయింది. ప్రభుత్వం సైతం ఆదిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. 42 శాతం రిజర్వేషన్లు కొలిక్కి రాకపోవడం.. కేంద్రం తీసుకొచ్చిన సర్ తో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది సమాచారం.
Also Read: Home Remedies: జుట్టు బాగా పెరగాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే..

