Local-Elections
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Local body Elections: స్థానిక ఎన్నికలపై తెలంగాణ మంత్రుల కీలక నిర్ణయం!

Local body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల సర్వేలు?

నియోజకవర్గాల వారీగా చేపట్టాలని నిర్ణయం
ఖమ్మంలో ఇప్పటికే ప్రారంభం
లీడర్లు, పార్టీ రెండు కేటగీరీలుగా అభిప్రాయాల సేకరణ
రాష్ట్రమంతా నిర్వహించాలని పార్టీ ఆదేశం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) నిమిత్తం క్షేత్రస్థాయి పరిస్థితిపై సర్వేలు చేయించాలని మంత్రులు  నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కీలక మంత్రి అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేపిస్తున్నట్లు సమాచారం. దీన్ని పరిశీలించిన మిగతా మంత్రులు కూడా తమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ చేయించాలని ఫిక్స్ అయ్యారు. పార్టీ కూడా సర్వేలు కచ్చితం అనే రూల్‌ను పెట్టింది. దీంతో కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థల ద్వారా జనాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు మినిస్టర్లు సిద్ధమయ్యారని సమాచారం.

ఎమ్మెల్యేల సమన్వయంతో ఆయా సెగ్మెంట్ల వారీగా ఒపీనియన్లను సేకరించనున్నారు. లీడర్లు, పార్టీ.. ఇలా రెండు ప్రధాన కేటగిరీలుగా అభిప్రాయాలను తీసుకోనున్నారు. లోకల్ బాడీలో పోటీ చేయాలనుకుంటున్న  ఆశావహులు, పార్టీపై ఫీడ్ బ్యాక్ తీసుకొని, అభ్యర్ధుల ఎంపికలో ఫిల్టర్ చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ ప్రాసెస్ నిర్వహించినట్లు గాంధీభవన్ టీమ్ గుర్తుచేసింది. లోకల్ బాడీలోనూ కచ్చితత్వంతో క్యాండిడేట్లను సెలక్షన్ చేసేందుకు సర్వేలు ఉపయోగపడతాయని పీసీసీ కూడా చెబుతున్నది. దీంతో సర్వేలు తప్పనిసరి అనే సంకేతాన్ని కూడా ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించడం గమనార్హం.

Read Also- India vs Pak Match: ‘భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్’ డిమాండ్లపై టీమిండియా ఫీల్డింగ్ కోచ్ స్పందన

ఆరు గ్యారంటీలపై ఏమనుకుంటున్నారు?

రాష్ట్రవ్యాప్తంగా 6 గ్యారంటీలు అమలు, పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కారం, రైతు రుణమాఫీ.. ఇలాంటి అంశాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. వ్యక్తిగత ఇమేజ్ ఉన్నదా? , పార్టీ మైలేజ్‌తో విజయం వరిస్తుందా? అని విభజించేందుకు సర్వే తప్పనిసరిగా ఉపయోగపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరు, కార్యక్రమాలు, కొత్త పాలసీలపై కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. జనాలతో ప్రభుత్వం ఏ మేరకు మమేకమైందనే విషయాన్ని ఈ స్క్రీనింగ్ ద్వారా గుర్తించవచ్చనేది పార్టీ నేతల అభిప్రాయం. దీన్ని బట్టే అభ్యర్థిని ఈజీగా ఎంపిక చేయవచ్చని లీడర్లు నమ్ముతున్నారు. వాస్తవానికి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చింది. దీంతో స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు లీడర్లు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పవర్‌లో ఉన్నందున తప్పనిసరిగా గెలుస్తామనే భరోసా క్షేత్రస్థాయిలోని ఆశావహుల్లో ఉన్నది. దీంతో కాంపిటేషన్ భారీగానే నెలకొన్నది. కచ్చితమైన అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు ఇలాంటి సర్వేలు తప్పనిసరి అంటూ ఓ కీలక లీడర్ వెల్లడించారు.

Read Also- Donald Trump: రష్యా, చైనా టార్గెట్‌గా నాటో దేశాలకు ట్రంప్ షాకింగ్ సూచనలు

సార్ మాకు వచ్చేలా చూడండి?

త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయంటూ ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని లీడర్లంతా తమకు టిక్కెట్ ఇచ్చేలా చూడాలని మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సర్వేల్లో తమపై ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. పార్టీ తరపున టిక్కెట్ కన్ఫామ్ చేయించాలని కోరుతున్నారు. అనుచరులు, పార్టీ కోసం పనిచేసిన నేతల నుంచి భారీగా ప్రెజర్ పెరగడంతో మంత్రులు సైతం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్టారు. పార్టీ ఎవరికి టిక్కెట్ ఇచ్చిన అంతా కలిసి పనిచేయాల్సిందేనంటూ మంత్రులు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. టిక్కెట్ల అంశాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయించాల్సిందే పార్టీ అంటూ దాటవేస్తున్నారు.

Just In

01

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!

Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!