Women Safety: వాహనాల్లో లొకేషన్​ ట్రేసింగ్ డివైజ్​
location-tracker
Telangana News

Women Safety: వాహనాల్లో లొకేషన్​ ట్రేసింగ్ డివైజ్​… నేరాలకు చెక్ పెట్టేందుకే!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రయాణికులు(Passengers), ముఖ్యంగా మహిళల (Women) రక్షణ (Safety) కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్​వాహనాలు అన్నింటిలో లొకేషన్ ​ట్రేసింగ్​ డివైజ్ (Location Tracing Device) ​ఏర్పాటును తప్పనిసరి చేయనున్నది. దీనిని అమలు చేయటానికి అనుమతులు కోరుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి (Central Govt) లేఖ రాసింది. అనుమతులు రాగానే లొకేషన్ ట్రేసింగ్​డివైజ్​ఏర్పాటును తప్పనిసరి చేయనున్నది. ఎవరైనా దీనిని పాటించకపోతే వాహనాలు సీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రయాణికుల భద్రత కోసం ఈ తరహా చర్యలు చేపట్టిన మొదటి రాష్ర్టంగా తెలంగాణ నిలువనున్నది.

ప్రయాణికుల రక్షణకు..
ట్రాన్స్‌పోర్ట్​విభాగం అధికారులు తెలిపిన ప్రకారం ప్రస్తుతం మన రాష్ట్రంలో టాక్సీసర్వీస్ అందిస్తున్న కార్లు, ద్విచక్ర వాహనాల సంఖ్య రెండు లక్షలకు పైగానే ఉంది. సొంత వాహనాలు లేనివారు, ట్రాఫిక్‌లో ముప్పుతిప్పలు పడుతూ ఏం డ్రైవింగ్​చేస్తామని అనుకుంటున్న వాళ్లు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం రోజుకు కనీసం ఆరు లక్షల మంది ప్రైవేట్​ టాక్సీలపై ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది క్యాబ్​డ్రైవర్లు అవకాశం దొరికినపుడు ప్రయాణికుల పట్ల నేరాలకు పాల్పడుతున్నారు. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిసార్లు మాయమాటలు చెప్పి తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడులు చేస్తున్నారు. మరికొన్నిసార్లు ప్రయాణికులను బెదిరించి డబ్బు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు, వాహనాల లొకేషన్ గుర్తించేందుకు ఈ డివైజ్ ఉపయోగపడనున్నది.

నేరాలకు కళ్లెం వేయటానికే..

దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడగా నేరాలకు పాల్పడే వారి ఆటను క్షణాల్లో కట్టించటానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బాధితులు 100 నంబర్‌కు డయల్​చేసి ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. వచ్చిన ఫోన్​కాల్​ నంబర్​ ఆధారంగా ఫిర్యాదు చేసిన వారు ఎక్కడున్నారన్నది తెలుసుకోవటానికి టైం పడుతున్నదని తెలిపారు. అలా కాకుండా లొకేషన్​ట్రేసింగ్​డివైజ్‌లను ఏర్పాటు చేయిస్తే నిమిషాల్లోనే నేరాలకు పాల్పడిన వారిని పట్టుకోవచ్చన్నారు. దీని కోసం బాధితులు తాము ప్రయాణిస్తున్న వాహనం నంబర్ ​నోట్​చేసుకొని పోలీసులకు తెలియ చేస్తే సరిపోతుందన్నారు. నంబర్​తెలియగానే సదరు వాహనం ఎక్కడ ఉందన్నది లొకేషన్ ​ట్రేసింగ్ ​డివైజ్ ​ద్వారా తెలుసుకుని సమీప పోలీస్​స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వీలైనంత తక్కువ సమయంలో నిందితులను పట్టుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సరుకులు తీసుకెళ్లే గూడ్స్​వాహనాలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా తేలికగా తెలుసుకోవచ్చని వివరించారు.

Also Read:

Malayalam Actress: అప్పట్లో హీరోయిన్ ఓవర్ నైట్‌ స్టార్.. కానీ ఇప్పుడు!

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..