Malayalam Actress: ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలి మూవీతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ‘ఒరు ఆధార్ లవ్’ అనే చిన్న మలయాళ మూవీ ద్వారా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ స్టార్ అయిపోయింది. కంటి గీటుతో యూత్ మనసులను కొల్లగొట్టి.. రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. అయితే సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు, ఎలా కలిసొస్తుందో ఎవరూ చెప్పలేము. కొందరు ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. మరికొందరు ఓవర్ నైట్‌లో స్టార్ అవుతూ ఉంటారు. ఈ జాబితాలో ప్రియా ప్రకాష్ వారియర్ ఉంటుందనే చెప్పాలి. అలా కన్ను కొట్టి ‘వింక్ గర్ల్’గా ప్రియా ప్రకాష్ వారియర్ రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అయితే స్టార్ స్టేటస్ ఎక్కువ కాలం కొనసాగించకోలేపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలే రాకుండా పోయాయి. ఇప్పుడు ఈ భామ ఏం చేస్తుందంటే?.
2018లో కన్ను కొట్టి ‘వింక్ గర్ల్’గా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఆ ఇయర్ అత్యధిక సెర్చ్ చేసిన నటిగా రికార్డు కూడా కొట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ హట్టర్ ప్లాప్ అయ్యాయి. చెక, ఇష్క్, మందాకినీ వంటి మలయాళం, తెలుగు మూవీస్‌లో నటించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బాలీవుడ్‌లో నటించిన యారియన్ 2 కూడా ప్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ తగిలించుకుంది. అయితే 7 ఏళ్ల తరువాత ఈ దక్షిణాది హీరోయిన్ హిందీలో అరంగేట్రం చేయడమే కాకుండా, ఇప్పటి వరకు బాలీవుడ్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంలో భాగం కాబోతోంది. ఇప్పటి వరకు ఒక్క విజయం అందుకోని ఈ అమ్మడు రాబోయే చిత్రాలతో హిట్ కొట్టి, ఐరెన్ లెగ్ ట్యాగ్ నుండి బయటపడాలని కోరుకుందాం. 18 ఏండ్ల వయసు ఉన్నపుడు ‘ఒరు అదార్ లవ్’లో ప్రియా నటించింది. ఈ చిత్రం 2019లో విడుదలై మంచి విజయం సాధించింది. ఒక స్కూల్ స్టూడెంట్ పాత్రను పోషించింది. ఈ మూవీ టీజర్ ను విడుదల చేసినప్పుడు ప్రియా క్లిప్ తెగ వైరల్ అయ్యింది. విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో లక్షలాది లైకులు, కామెంట్స్‌తో దుమ్మురేపింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఆమె ఓవర్ నైట్‌లో హీరోయిన్‌గా మారింది.
Also Read: ఛీఛీ.. పుట్టబోయే పిల్లల గురించి ఇలా మాట్లాడుతున్నారు: ప్రియమణి