Priyamani: ‘ఎవరే అతగాడు’ అనే మూవీతో ప్రియమణి తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, హరే రామ్, కింగ్, ద్రోణ, శంభో శివ శంభో, గోలీమార్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ప్రియమణి బిజీ అయిపోయింది. అటు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన ఫ్యామిలీ విషయాలతో తదితర విషయాలు వెల్లడించింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి తనను విమర్శిస్తూనే ఉన్నారని బాధపడింది. తనకు పుట్టబోయే బిడ్డల గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారని ఫీల్ అయ్యారు.
2017లో ముస్తాఫారాజ్‌తో ప్రియమణికి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే 2016లో తనకు నిశ్చితార్ధం అయినప్పటి నుంచి తనపై విమర్శలు చేయడం ప్రారంభించారని వెల్లడించారు. తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకున్నానని, అయితే దానికి భిన్నంగా జరిగిందని అసహనం వ్యక్తంచేశారు. పెళ్లి విషయం సంతోషంగా పంచుకున్నప్పటికీ నుంచి తనపై ద్వేషం పెంచుకున్నారని వాపోయారు. లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు పుట్టాక వారిని ఐసిస్‌లో చేర్పిస్తారా? అంటూ కొందరు చేసిన కామెంట్స్ తన మనస్సును ఎంతో బాధపెట్టాయని ఫీల్ అయ్యారు. అయితే తాను సినీ పరిశ్రమకు పర్సన్ కాబట్టి అంతలా పట్టించుకోను అని, కాకపోతే తన భర్తపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అలా తన భర్తపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. అతని గురించి ఏమి తెలియకపోయిన ఎందుకు కామెంట్స్ చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. ఎప్పుడైన సోషల్ మీడియా వేదికగా తమ భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తే.. 10 మందిలో 9 మంది తన భర్తపైనే కామెంట్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇలా వారు కామెంట్స్ చేయడం వల్ల బాధపడుతున్నామని చెప్పారు.
Also Read: పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై నటుడు హాట్ కామెంట్స్
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్‌సిరీస్‌లో ప్రియమణి యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్స్ ఈ వెబ్‌సిరీస్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలో మూడో సీజన్ కూడా రిలీజ్ కానుంది. మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో తన వైఫ్ పాత్ర ప్రియమణి పోషిస్తుంది. ఇక ఇటీవల సిరీస్ గురించి, డైరెక్టర్ మణిరత్నం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ 3వ సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సీజన్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆశించారు. ఇంకా డైరెక్టర్ మణిరత్నం అంటే చాలా ఇష్టమని తెలిపింది. గతంలో తాను నటించిన ‘రావన్’ అనే సినిమాకు ఆయన డైరెక్షన్ వహించారని తెలిపింది.