NCD Screening: దేశవ్యాప్తంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) స్క్రీనింగ్‌లో గుజరాత్ (Gujarat) ఫస్ట్ ప్లేస్‌లో నిలువగా, తెలంగాణ (telangana) సెకండ్ ప్లేస్ సాధించింది. కోటిమందికి పైగా టార్గెట్ పెట్టుకున్న స్టేట్స్‌లో తెలంగాణ సెకండ్ ప్లేస్‌లో నిలవడం గమనార్హం. ఓవరాల్ ఎన్సీడీ స్క్రీనింగ్‌లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. పకడ్బందీగా సర్వేతోపాటు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఎన్సీడీ స్క్రీనింగ్‌లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఎన్సీడీని సమర్ధవంతంగా నిర్వహించడంతోనే ఇటీవల నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణలో నిర్వహించిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల హెల్త్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడ జరిగిన ఎన్సీడీ స్క్రీనింగ్‌ను పరిశీలించారు. సర్వే విధానంపై అధ్యయనం చేశారు. అనంతరం ఇక్కడి పాలసీపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇతర రాష్ట్ర అధికారులు.. దేశవ్యాప్తంగా తెలంగాణ పాలసీ అమలు చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం గమనార్హం.
తమిళనాడు, కేరళలు జీరో?
గుజరాత్ తర్వాత మన స్టేట్ ముందు వరుసలో ఉన్నది. హైయ్యెస్ట్ టార్గెట్ పాపులేషన్‌లో ఎన్సీడీ స్క్రీనింగ్‌లో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమైంది. తెలంగాణ తర్వాత ఛత్తీస్‌గఢ్, హర్యానా, అస్సాం, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, మమారాష్ట్ర, జార్ఘండ్ , పంజాబ్ ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఎన్సీడీ స్క్రీనింగ్‌ను ఇప్పటి వరకు నిర్వహించలేకపోవడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్‌కూ ఆ రాష్ట్రాల అధికారులు హాజరై.. ఇక్కడ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు.
మన దగ్గర ఇలా సర్వే
గ్రామాలవారీగా క్యాంపులు పెట్టి బీపీ, షుగర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా ఈ స్క్రీనింగ్ పూర్తైయింది. బాధితులందరికీ ప్రత్యేక మెడిసిన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేసే మెడిసిన్స్‌తో ప్రతి నెల బాధితులకు కిట్లను అందజేస్తున్నారు. 30 ఏళ్లకు పైబడినోళ్లందరికీ క్షేత్రస్థాయిలోనే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఈ స్క్రీనింగ్ నిర్వహించడం గమనార్హం. ఇక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి వ్యాధి తీవ్రతరం కాకుండా మెడికల్ కాలేజీలకు రిఫర్ చేస్తున్నారు. డిజిటల్ విధానంలో స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఇక అన్ని మెడికల్ కాలేజీల్లో ఎన్సీడీ క్లినిక్‌లు ఓపెన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 క్లినిక్‌లలో పేషెంట్ల ఫాలోఅప్ నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య మందిర్‌లలో స్పెషల్ డ్రైవ్
దేశవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి బీపీ, షుగర్ డ్రైవ్ ప్రారంభమైంది. మార్చి 31 నిర్వహించనున్నారు. ప్రభుత్వాసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలో ఈ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు స్క్రీనింగ్ చేయగా, ఈ క్యాంపులలో డాక్టర్లు, ఆయుష్ డాక్టర్లు, ఎంఎల్ హెచ్ పీలు, బీఎస్సీ నర్సింగ్ ఆఫీసర్లు భాగస్వామ్యం కానున్నారు. ఏప్రిల్ నెల నుంచి వారంలో రెండు రోజులు ఈ తరహా క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చారు.
స్టేట్ టార్గెట్ పాపులేషన్ హైపర్ టెన్షన్ స్క్రీన్ శాతం షుగర్ స్క్రీనింగ్ శాతం
గుజరాత్ 2,64,57,590 1,77,72,436 50 1,79,61,784 50
తెలంగాణ 1,40,93,300 96,11,587 48 1,00,63,007 50
ఛత్తీస్‌గఢ్ 1,11,66,600 43,97,238 36 44,66,815 37
హర్యానా 1,11,77,330 33,38,793 29 33,02,115 28
అస్సాం 1,32,13,810 37,82,417 29 36,78,226 28
మధ్యప్రదేశ్ 3,20,34,230 78,57,992 25 79,74,755 25
ఒడిశా 1,71,22,120 62,61,721 25 63,11,310 25
రాజస్థాన్ 2,99,79,250 73,73,187 24 74,29,743 24
కర్ణాటక 2,50,46,040 82,81,693 24 84,95,787 25
ఆంధ్రప్రదేశ్ 1,96,67,720 74,16,465 23 74,16,465 23
బీహార్ 4,68,99,720 90,56,683 19 89,81,233 19
మహారాష్ట్ర 4,67,43,950 77,22,428 17 79,68,539 17
జార్ఖండ్ 1,46,02,420 20,26,178 14 1,74,920 14
పంజాబ్ 1,13,70,100 12,53,474 11 12,32,770 11
తమిళనాడు 2,84,38,200 0 0 0 0
యూపీ 8,71,85,690 0 0 0 0
వెస్ట్ బెంగాల్ 3,66,61,080 0 0 0 0
కేరళ 1,32,37,120 0 0 0 0
Read also: Urvashi Rautela: ఇండియా-పాక్ మ్యాచ్‌లో ఊర్వశి రౌతేలాకు స్పెషల్ సర్‌ప్రైజ్