Urvashi Rautela: ఇండియా-పాక్ మ్యాచ్ అంటే మాములు క్రేజ్ ఉండదు. భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రెండు టీమ్‌ల మధ్య పోటీ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఆదివారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champion Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో అందరూ ఫుల్ ఖుషి అయ్యారు. దేశంలో ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు దుబాయ్ వెళ్లి మ్యాచ్ వీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మినిస్టర్ నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, స్టార్ సినీ డైరెక్టర్ సుకుమార్ తదితరులు దుబాయ్ వెళ్లి స్టేడియంలో మ్యాచ్ చూస్తూ సందడి చేశారు. ఇంకా వీరితో పాటు బాలీవుడ్ నటులు కూడా వచ్చారు. మరోవైపు అందాల తార ఊర్వశి రౌతేలా కూడా స్టేడియంలో సందడి చేసింది. ఈ మ్యాచ్‌కి ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. వాల్తేర్ వీరయ్య, బ్రో వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో ఊర్వశి అలరించిన సంగతి తెలిసిందే.
ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’లో కూడా స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్స్‌తో ఊర్వశి రౌతేలా అలరించింది. ‘దబిడి దిబిడి’ అనే ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేసి మంచి పాపులారిటీ పెంచుకుంది. అయితే ఇండియా-పాక్ మ్యాచ్‌లో స్టేడియం సిబ్బంది ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె బర్త్‌డేకు రెండు రోజుల ముందే స్టేడియంలో కేక్ కట్ చేయించారు. ఆ స్టేడియం సిబ్బంది కేక్ తీసుకొచ్చి ఊర్వశితో కట్ చేయించారు. అయితే ఆమె పుట్టిన రోజు ఫిబ్రవరి 25. అంటే రెండు రోజుల ముందే పాక్, ఇండియా క్రికెట్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి రికార్డు సృష్టించింది. స్టేడియంలో క్రికెట్ అభిమానులు ముందు మొదటిసారిగా బర్త్ డే చేసుకున్న నటిగా చరిత్రలోకి ఊర్వశి ఎక్కారు. దీంతో ఊర్వశి ఫుల్ ఖుషి అవుతోంది.
Also Read: మళ్ళీ వస్తున్నా.. డోంట్ వర్రీ: సమంత
మరోవైపు ఈ బ్యూటీ తెలుగులో మరో మూవీ ఆఫర్ కొట్టేసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఓ చిత్రంలో ఈ భామ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి షూటింగ్ కూడా జరుగుతోంది. రెండో షెడ్యూల్‌లో ఊర్వశి సీన్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జంటగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సెకండ్ షెడ్యూల్ షూట్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ఊర్వశి సన్నివేశాలు షూట్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.