Actress Samantha
ఎంటర్‌టైన్మెంట్

Actress Samantha: మళ్ళీ వస్తున్నా.. డోంట్ వర్రీ: సమంత

Actress Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాగచైతన్య(Naga chaithanya) హీరోగా నటించిన ‘ఏ మాయ చేశావే’ అనే మూవీతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. దర్శకనిర్మాతలు అందరూ ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారు. తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించింది. ఇక నాగచైతన్యతో డైవర్స్ అనంతరం బాలీవుడ్‌(Bollywood)కు షిఫ్ట్ అయ్యింది. అక్కడ ముఖ్యంగా వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తుంది. అయితే విడాకుల తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంది. ఎన్నో అవకాశాలు వచ్చిన అన్నింటిని రిజెక్ట్ చేసింది. ఆమె మొత్తానికే సినిమాలకు గుడ్ బై చెపుతుందని ప్రచారం కూడా నడించింది. తాజాగా ఆమె తెలుగు సినిమాలు చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక సమంత ఎప్పుడు ప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. వ్యకిగత విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తూ ఉంటుంది. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తా అంటూ అనౌన్స్ చేసింది.

Aslo Read: తాగుడుకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్

అయితే సమంత తెలుగులో సినిమాలు చేయడం మానేసి ఫుల్‌గా బాలీవుడ్‌లో మకాం వేసింది. అక్కడ వెబ్ సిరీస్‌ల్లో మెయిన్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఆమె నటనకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇటీవల చాలా ఇంటర్వూస్‌లో పాల్గొన్న సమంత ఎక్కడ తెలుగు ఇండస్ట్రీ(Industry) గురించి మాట్లాడలేదు. తెలుగులో మళ్ళి సినిమాలు తీస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ.. తెలుగులో మూవీస్ ఎందుకు తీయడం లేదో చెప్పింది. అలాగే పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్‌), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్‌ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్‌ఎల్‌), దివ్య ప్రభ (ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌). వీరంతా రాక్‌స్టార్స్‌ అని నటన రియల్ స్టిక్ గా ఉంటుందని చెప్పింది. ఇంకా ఎవరైనా పాజిటివ్ ఆలోచిస్తేనే మంచిదని, నెగటివ్‌గా ఆలోచించే వారు.. మెడిటేషన్ చేస్తే బెటర్ అని పేర్కొంది. ఈ క్రమంలోనే మళ్ళీ మీరు టాలీవుడ్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మంచి అవకాశాలు వస్తే చేస్తానని చెప్పింది. స్టోరీ బాగుంటే వదులుకోను అని చెప్పింది. మొత్తానికి మళ్ళీ తెలుగులో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ