Actress Urvashi
ఎంటర్‌టైన్మెంట్

Actress Urvashi: తాగుడుకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్న సీనియర్ నటి

Actress Urvashi: సినీ ఇండస్ట్రీకి రావాలంటే పెద్ద కష్టమే. అవకాశాల కోసం ఎంతో మంది చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాల్సిందే. ఇక ఒక్కసారి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే తిరుగు అనేది ఉండదు. కాకపోతే కొందరు ఆ స్టార్ డమ్ తెచ్చుకుని దాన్ని అలాగే కంటిన్యూ చేయడంలో విఫలం అవుతూ ఉంటారు. స్టార్ స్టేటస్ వచ్చాక వ్యసనాలకు బానిసై కెరీర్ నాశనం చేసుకుంటారు. ఇక, తాగుడుకు బానిసై లైఫ్ ఆగం చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌(Star Heroine)గా పేరొందిన నటి ఊర్వశి కూడా తన సినీ జీవితాన్ని ఇలాగే నాశనం చేసుకుంది. నటి ఊర్వశి అప్పట్లో స్టార్ హీరోల అందరితో నటించింది. సౌత్ ఇండియా(South India)లో అనేక చిత్రాల్లో యాక్ట్ చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, అంబరీష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అద్భుతమైన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో ఉన్న అప్పటి స్టార్ హీరోలు అందరితో యాక్ట్ చేసింది. ఏమైంది ఏమో కానీ ఊర్వశి తాగుడుకు బానిసయ్యింది. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మద్యపాన వ్యసనం కారణంగా సినీ కెరీర్ నాశనం చేసుకుందని అప్పట్లో టాక్ నడిచింది.

Actress Urvashi

Also read: నటికి ముద్దు పెట్టేందుకు ట్రై చేసిన ఆకతాయి.. నటి ఏం చేసిందంటే?

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో ఊర్వశి పుట్టింది. అయితే ఆమె అసలు పేరు కవిత రంజిని. సినీ పరిశ్రమలోకి బాలనటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే స్టార్ డమ్ తెచ్చుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్‌లో ఊర్వశికి ఛాన్స్ లు రాలేదు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటించింది. 1984లో చిరంజీవితో కలిసి ‘రుస్తుం’ అనే చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1985లో బాలకృష్ణతో ‘భలే తమ్ముడు’, 1987లో ‘న్యూఢిల్లీ’ అనే హిందీ సినిమాలో నటించింది. అలా స్టార్ట్ అయిన ఆమె ప్రయాణం 2006లో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.

ఊర్వశి సుమారు 700కు పైగా చిత్రాల్లో నటించింది. ఇందులో కొన్ని హీరోయిన్‌గా నటిస్తే, మరికొన్ని పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించింది. ఊర్వశి నటుడు మనోజ్ కె విజయన్‌ను 2007లో పెళ్లి చేసుకుంది. వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. భర్తతో విడాకులు తీసుకుంది. ఆ సమయంలో ఈ జంటకు ఒక కూతురు ఉంది. కూతురిని తన దగ్గరే పెంచుకుంది. 2016లో ఊర్వశి చెన్నైకి చెందిన బిజినెస్ మాన్ శివప్రసాద్‌ను 44 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకుంది. రెండవ భర్తతో ఆమె ఓ కుమారుడికి జన్మించింది. అతడికి ఇహన్ ప్రజాపతి అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఊర్వశి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ.. లైఫ్ కొనసాగిస్తోంది.

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!