Bhatti Vikramarka: ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకం విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మల్లు కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Min srider babu) తో కలిసి సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రూ22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే రాష్ట్రంలో వేగంగా ఇళ్ల నిర్మాణం చేస్తుందని తెలిపారు. స్టీలు సిమెంటు పరిశ్రమలను ఈ రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహించామన్నారు.
ఒకే ధరకు సిమెంటు
మానవీయ కోణంలో ఆలోచించి ఇందిర ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలు తగ్గించి,ఏమాత్రం నాణ్యతలో రాజీ పడకుండా ఇందిరమ్మ ఇళ్లకు సిమెంటు, స్టీలు అందించాలని తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పెద్ద , చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు(Cement), 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు(Steel) అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు.
Also Read: Palakurthi: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రేసులో బడా లీడర్లు.. గ్రామాల్లో మొదలైన హడావుడి
వైస్ ఆలోచనలు గొప్పవి..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలను, కాంగ్రెస్ బావ జాలాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సాయంత్రం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన వైయస్ స్మారక అవార్డుల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైయస్ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 10 లక్షల కు పెంచామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు. తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందించడమే కాకుండా సన్నధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ అందిస్తున్నామని వివరించారు.
Also Read: Bhudan Lands Scam: భూదాన్ భూముల కేసులో దూకుడు పెంచిన ఈడీ.. ఇద్దరి ఆస్తులు జప్తు..?