Urea App: యూరియా కోసం యాప్.. ఆర్గానిక్ పంటలకు మరో యాప్
Urea App (imagecredit:swetcha)
Telangana News

Urea App: యూరియా కోసం ఒక యాప్.. ఆర్గానిక్ పంటలకు మరో యాప్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Urea App: వచ్చే ఖరీఫ్ వరకు యూరియా యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తేవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్‌ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, కో-ఆపరేషన్, హార్టికల్చర్ శాఖల పురోగతిపై సోమవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, తెలంగాణ విజన్ 2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పటికీ, మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుల్ల(Fake organic labels)తో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నందున నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరుతుందన్నారు. వ్యవసాయశాఖ ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక యాప్ తీసుకురానుందన్నారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారు తాను కొనబోయే ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు, ఎలా పండించాడో తెలుసుకుంటాడన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీల్లోని ఖాళీ ప్రదేశాల్లో ఆర్గానిక్ పంటలు పండించి, అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లైతే రైతులు ఆర్గానిక్ పంటలవైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

మరో రూ.50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం వివిధ పథకాల కింద ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పెద్దమొత్తంలో యూరియా(Urea) బఫర్ స్టాక్‌లను నిల్వలో ఉంచుకోవాలని, భవిష్యత్‌లో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, రైల్వే రేక్ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసే విధంగా రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాలకు బోనస్ ఇస్తున్నందున, పంట కాలానికి అనుగుణంగా వ్యవసాయశాఖ ద్వారా సన్న వడ్లలో మేలైన వంగడాలను సూచించాలని, రైతులు అట్టి రకాలను ఉత్పత్తి చేసి మంచి ధర పొందేటట్లు చూడాలన్నారు.

Also Read: Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ.. ఏం అన్నారంటే?

నెలాఖరులోకా శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయండి

అధికశాతం కచ్చితత్వంతో శాటిలైట్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటల శాటిలైట్ మ్యాపింగ్ డేటా రావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాల పంటల శాటిలైట్ మ్యాపింగ్‌తో డేటా అందించాలని, డేటా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి అధికారులతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకుల్లో కాకుండా కో-ఆపరేటివ్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో కేంద్రం ఇచ్చిన లక్ష్యానికి రెట్టింపు ప్లాంటేషన్ జరిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి అన్నారు. పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకోసం డిపార్ట్ మెంట్లలో గాని, యూనివర్సిటీలలో గాని మరియు కార్పోరేషన్లలో గాని ఏర్పాటు చేసే ప్రతి కమిటీలలో అధికారులతో పాటు రైతుల ప్రాతినిధ్యం వహించేలా కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికల దగ్గర సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Nara Rohith: వెంకటేష్ ‘ఎకే 47’లో పవర్ ఫుల్ రోల్ చేయబోతున్న నారా రోహిత్.. ఏంటంటే?

Just In

01

GHMC: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు కసరత్తు ప్రారంభం.. ఎన్నికల నిర్వహణ పై కీలక అప్డేట్..?

Mega 158: మెగా158లో కూతురు పాత్ర కోసం పోటీపడుతున్న ట్రెండీ హీరోయిన్స్.. ఎవరంటే?

Political Trolls: హరీశ్ రావు ఎలివేషన్స్‌కు.. సజ్జనార్ బ్రేకులు.. పరువు మెుత్తం పోయిందిగా!

Hyderabad Metro: మెట్రో ఫేజ్-2 మీ పలుకుబడిని ఉపయోగించండి.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

Urban Parks: తెలంగాణకు 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు.. జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసా..?