Group-1 Results: మరికాసేపట్లో గ్రూప్ 1 ఫలితాలు
tgpsc
Telangana News

Group-1 Results: మరికాసేపట్లో గ్రూప్ 1 ఫలితాలు

Group-1 Results: తెలంగాణ(Telangana)లో గ్రూప్‌-1 (Group-1)మెయిన్స్(Mains) ఫలితాలు (Results) మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల (Preliminary Marks) వివరాలు ఈరోజు టీజీపీఎస్సీ (TGPSC) వెల్లడించనుంది. అలాగే మంగళవారం గ్రూప్ 2 (Group-2)పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్… 14న గ్రూప్ 3 (Group-3) పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

కాగా గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా ముందు మెయిన్స్ మార్కుల ప్రకటనతో గ్రూప్‌-1 నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ తెలిపింది.

గతంలో గ్రూప్-1 నియామకాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు(High court)ను ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారించిన హైకోర్టు కేసులను కొట్టివేసింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీం కోర్టు(Supreme court)ను ఆశ్రయించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మెయిన్స్ ఫలితాలను వెల్లడించనున్నారు.

Also Read:

Pranay Amruta Case: సంచలన కేసులో తుది తీర్పు నేడే… అమృతప్రణయ్ కేసులో ఏం జరగనుంది?

 

 

 

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!