pranay
తెలంగాణ

Pranay Amruta Case: సంచలన కేసులో తుది తీర్పు నేడే… అమృతప్రణయ్ కేసులో ఏం జరగనుంది?

ప్రేమ పెళ్లికి నిండు ప్రాణం బలి
తల్లిదండ్రులకు దూరమైన కొడుకు
భర్తను కోల్పోయి భార్య వితంతువుగా
వేదనతో ప్రాణం తీసుకున్న నిందితుడు
ఇందులో గెలిచిందేవరు.. ఓడిందేవరు?
ఏడేండ్లు.. ఏడుగురు నిందితులు
ఇరుపక్షాలకు మిగిలింది తీరని శిక్షే..
మిర్యాలగూడ అమృతప్రణయ్ కేసులో నేడే తీర్పు

నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ : అమృత ప్రణయ్(Amrita Pranay).. ఈ పేరు దేశవ్యాప్తంగా సరిగ్గా ఏడేండ్ల క్రితం మారుమోగింది. ప్రణయ్ మర్డర్‌(Pranay Murder)తో అంతా ఉలిక్కిపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఓ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును కోల్పోయింది. కండ్లు తెరవక ముందే ఓ పసిప్రాణం తండ్రిని కోల్పోయింది. ఓ తండ్రి తన ఒక్కగానొక్క బిడ్డకు దూరమయ్యాడు. కోటి ఆశలతో జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ యువతి ఏడాది గడవకముందే భర్తను కోల్పోయి వితంతువుగా మారింది. కులంహాకార జాఢ్యమో, క్షణికావేశమో, ప్రేమో. కారణం ఏదైనప్పటికీ ప్రణయ్ మర్డర్ వ్యవహారం ఎన్నో కుటుంబాల్లో అలజడి రేపింది. రెండు మూడేండ్లు గడిచే సరికి చేసిన తప్పు తెలిసొచ్చినా.. తిరిగి వెనక్కి తీసుకోలేనంత దారుణం జరిగిపోయింది. ఏకంగా అమృత తండ్రి మారుతీరావు సూసైడ్ చేసుకుని చనిపోయేవరకు వెళ్ళింది. ఇలా ఒక్క తప్పు పదుల మంది జీవితాలపై చెరగని ముద్ర వేసింది. నేడు అమృత ప్రణయ్ కేసులో నల్లగొండ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ‘స్వేచ్ఛ’ స్పెషల్ స్టోరీ.

స్కూల్ ఏజ్ నుంచే ప్రేమాయణం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalguda)కు చెందిన మారుతీరావు(MarutiRao) కూతురు అమృ‌త అదే పట్టణానికి చెందిన బాలస్వామికి కొడుకు ప్రణయ్ చిన్నతనం నుంచే కలిసే చదువుకున్నారు. అమృత ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకున్నారు(School Age Love). ఈ క్రమంలోనే 2018లో ఇంట్లో తెలియకుండా వీరిద్దరూ ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో అప్పటికే పేరు పలుకుబడి ఉన్న మారుతీరావు తన కూతురు కులాంతర(Inter Cast) వివాహం చేసుకుందనే కోపంతో రగలిపోయాడు. సుపారీ(Supari) గ్యాంగ్‌తో 2018 సెప్టెంబర్ 14న గర్భిణీ అయిన అమృతను ప్రణయ్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా హత్య చేయించారు. ఈ పరువు హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు(SC, ST Atrocity Case), ఆర్మ్స్‌ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేసి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

ప్రాణం తీసుకున్న మారుతీరావు
కుటుంబమే ప్రపంచంగా బతికిన మారుతీరావు తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన భర్తను హతమారిస్తే.. కూతురు తిరిగి తన వద్దకు వస్తుందని భావించాడో.. లేక మరేదైనా కారణమో గానీ మొత్తానికి ప్రణయ్‌ను సుపారీ గ్యాంగ్‌తో మట్టుబెట్టించాడు. కానీ, అమృత తండ్రిని కన్నెత్తి చూసింది లేదు. తన భర్త చనిపోయే సమయానికి గర్భిణీ కావడంతో తనకు పుట్టబోయే బిడ్డలోనే ప్రణయ్‌ను చూసుకుంటూ కాలం గడిపింది. అయితే, కూతురు తన దగ్గరకు రాకపోవడం, జైలు జీవితం గడపడం, పైగా సమాజంలో పరువు పోవడం, రూ.కోట్ల డబ్బున్నా.. కూతురు అనుభవించే స్థితిలో లేకపోవడం.. మానసికవ వేదన ఇవన్నీ కలగలిసి మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే తండ్రి కులాంహాకారానికి భర్తను కోల్పోయిన అమృత.. ఉన్నా లేనట్టేనని భావించిన తండ్రిని సైతం కోల్పోయింది. ఆమె తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. ఇదిలావుంటే.. తండ్రి మారుతీరావును కడసారి చూసేందుకు వచ్చిన అమృతను అప్పట్లో కుటుంబ సభ్యులు బంధువులు అడ్డుకున్నారు. దీంతో అమృత వెను దిరిగారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు లేటర్ రాశాడు. తల్లి గిరిజ వద్దకు వెళ్లమని అమృతను ఆ లేఖలో కోరాడు. అప్పట్లో పోలీసుల రక్షణతో మిర్యాలగూడలో ఉన్న తల్లి గిరిజను అమృత పరామర్శించింది. ఒకరి కోపానికి ఇంతంటి తీర్చలేని వేదన ఇటు అమృత కుటుంబానికి.. అటు ప్రణయ్ కుటుంబానికి మిగిలింది.

నేడు తుది తీర్పు
అమృతప్రణయ్ కేసులో నల్లగొండ కోర్టు(Nalgonda court) తుది తీర్పును సోమవారం(మార్చి 10)న ఇవ్వనున్నది. ఇప్పటికే చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. అయితే ప్రణయ్ హత్యకేసులో ఎ-1 మారుతీ‌రావు, ఎ-2 బీహార్‌కు చెందిన సుభాశ్ శర్మ, ఎ-3 అజ్గర్ అలీ, ఎ-4 అబ్దులా భారీ, ఎ-5 ఎం.ఏ కరీం, ఎ- 6 శ్రవణ్ కుమార్, ఎ-7 శివ, ఎ-8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు (ఏ-1) 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఏ-2 సుభాశ్‌శర్మ, ఏ-3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే, తుది తీర్పు కోసం ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు