Sadabinama: గుడ్ న్యూస్.. తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు మోక్షం!
Sadabinama (imagecredit:twitter)
Telangana News

Sadabinama: గుడ్ న్యూస్.. తొలగిన కోర్టు స్టే.. దరఖాస్తులకు మోక్షం!

Sadabinama: భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. సాదాబైనామాల‌పై ఉన్న‌ స్టేను రాష్ట్ర హైకోర్టు మంగళవారం తొలగించిందని,ఈ తీర్పు లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు. సాదా బై నామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారని కానీ 2020 ఆర్ ఓ ఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు.

హైకోర్టులో కేసుకు ముగింపు

ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాకుండా పోయాయని దీనిపై కొంతమంది హైకోర్టు(Highcort)ను ఆశ్రయించారని తెలిపారు. సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసిందన్నారు. సీఎం(CM) ఆలోచన మేరకుక ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని తెలిపారు. సమస్య లను త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగిందన్నారు.

Also Read: NWDA meeting: వాడీవేడిగా ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం.. ఒప్పుకోని తెలంగాణ

18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం

గ‌త ప్ర‌భుత్వం అక్ర‌మంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్(Dharani Portal) న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశామ‌న్నారు. దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రోల్ మోడ‌ల్‌గా నిలిచిన ఈ భూభార‌తి చ‌ట్టం మేర‌కు రైత‌న్న‌ల, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు స‌ద‌స్సులు నిర్వ‌హించ‌గా 8.60 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెల‌పారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.

Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు 

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం