Telangana Govt: రాష్ట్ర స్థాయిలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 2001ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారాలు చూపించేందుకు ఈ కౌన్సిల్ పనిచేయనున్నది. వివిధ ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
Also Read: Swetcha Effect: ఆశ్రమ స్కూల్ లో అమానుషం.. స్వేచ్ఛ కథనానికి స్పందించిన అధికారులు
అయితే ఈ కౌన్సిల్ లో కనీసం 25 మంది సభ్యులు, గరిష్టంగా 30 మంది ఉండనున్నారు. అయితే యాభై శాతం సభ్యులను సర్కార్ నామినేటెడ్ చేస్తుండగా, మిగిలిన సగం మందికి సర్వీస్ అసోసియేషన్లు నియమించుకునే వెసులుబాటు ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నియమించే సభ్యులలో సీఎస్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఆర్థిక శాఖ, పురపాలక శాఖ, విద్యా శాఖ వంటి వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. కౌన్సిల్ కార్యదర్శిగా సాధారణ పరిపాలన శాఖకు చెందిన అదనపు, జాయింట్, డిప్యూటీ కార్యదర్శిలు వ్యవహరించనున్నారు.
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్,
ఇక తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ క్లాస్ 4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యూనిటెడ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్లు శాశ్వత సభ్యులుగా కొనసాగారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం
తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసిల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సంఘాలఉద్యోగుల పక్షంలో తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ , తెలంగాణ క్లాస్ పోర్ ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్, నుంచి రొటేషన్ పద్ధతిలో సభ్యులు పనిచేయనున్నారు.
Also Read: Koonamneni Sambasiva Rao: నేటి నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు.. సీపీఎ నేత పిలుపు