Private Colleges: వచ్చేనెల ఒకటో తేదీ లోపు ప్రైవేట్ కాలేజీలకు రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(Federation of Associations of Telangana Higher Institutions)(ఫతీ) డిమాండ్ చేసింది. లేకపోతే నవంబర్ 3 నుంచి డిగ్రీ(Degre), పీజీ(PG) కాలేజీలతో పాటు ప్రొఫెషనల్ కాలేజీలన్నీ నిరవధికంగా మూసివేస్తామని ప్రకటించింది. గచ్చిబౌలిలో ఫతీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది.
రూ.300 కోట్లు మాత్రమే రిలీజ్..
ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఫతీ చైర్మన్ రమేశ్ బాబు(Ramesh Babu), సెక్రెటరీ జనరల్ కేఎస్ రవికుమార్(KS Ravi Kumar), ట్రెజరర్ కృష్ణారావు(Krishna rao) మాట్లాడారు. దసరా, దీపావళికి ముందే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రూ.1200 కోట్లలో ఇప్పటి వరకూ కేవలం రూ.300 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన రూ.900 కోట్లు నవంబర్ 1 వరకూ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 2024-25 అకడమిక్ ఇయర్ వరకూ పెండింగ్ లో ఉన్న రూ.9వేల కోట్ల బకాయిలను వచ్చేఏడాది మార్చి 31లోగా చెల్లించేందుకు రోడ్ మాప్ ప్రకటించి అమలు చేయాలని కోరారు.
Also Read: Girls At Wines: స్కూల్ యూనిఫాంలో వైన్‌షాప్‌కు వెళ్లి మద్యం కొన్న బాలికలు.. నిర్ఘాంతపోయే ఘటన
విజిలెన్స్ తనిఖీల పేరిట..
హామీ ఇచ్చి నెరవేర్చకపోతే మార్చి(March), ఏప్రిల్(April) నెలల్లో జరిగే ఫైనల్ పరీక్షలను కూడా బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నవంబర్ 1 తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ తనిఖీల పేరిట సర్కార్ బెదిరించే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. సర్కార్ న్పందించకపోతే వచ్చేనెల 3 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు లక్షల మందితో ఓఆర్ఆర్ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అప్పటికీ న్యాయం జరగకపోతే 10 లక్షల మందితో హైదరాబాద్ కు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు.
Also Read: Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?
