Reservation Ordinance ( image credit: twitter)
తెలంగాణ

Reservation Ordinance: 30 రోజుల్లో రిజర్వేషన్లు చేయాలని సూచన!

Reservation Ordinance: రిజర్వేషన్ల సీలింగ్‌ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఆర్డినెన్స్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించిన గవర్నర్, లీగల్ ఒపీనియన్‌కు పంపించినట్లు సమాచారం. దీంతో ఆ ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ కోసం ఉన్నతాధికారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ సీలింగ్ తొలగిస్తేనే, రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతున్న నేపథ్యంలో, ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారు. హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండడంతో ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు.

ఒక వైపు సీఎం, సీఎస్‌లు ఫాలో అప్ చేస్తున్నా, ఆలస్యమైతే కోర్టు నుంచి తమకు సమస్యలు ఉంటాయనే భయం అధికారుల్లో ఉన్నది. కంటెంప్ట్‌ ఆఫ్​ కోర్టు కిందకు వస్తుందని సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆర్డినెన్స్‌లో ఎలాంటి చిక్కులు లేకుండా విత్ లీగల్ ఒపీనియన్లతో తయారు చేసి, గవర్నర్‌కు పంపించామని, అయినప్పటికీ ఆలస్యంపై సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. కోర్టు విధించిన సమయం జూలై 25 వరకే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: CM Revanth Reddy: 42శాతంపై ఎందుకు స్పందించడం లేదు.. లోక్‌సభలో రాజ్యసభల్లో ఒత్తిడి తెస్తాం

అంటే గరిష్టంగా ఒక్క రోజు మాత్రమే ఉన్నది. దీంతో గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ క్లియర్ చేపించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏకంగా ఢిల్లీ నుంచి ఫాలో అప్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 30 రోజుల్లో పూర్తి చేయాలని జూన్ 24న హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. 90 రోజుల్లో (సెప్టెంబ‌ర్ నెలాఖ‌రులోగా) స్థానిక సంస్థలు ఎన్నిక‌లు నిర్వహించాల‌ని, 30 రోజుల్లో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం హడావుడిగా ఆ ప్రాసెస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. కనీసం జూలై చివరి వరకైనా ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

క్యాప్ తొలగిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం?
పంచాయతీ రాజ్ యాక్ట్ 2018–29 ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సీలింగ్ ఉన్నది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ సీలింగ్ విధించామని గత ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితులను అనుగుణంగా రిజర్వేషన్లు మార్చుకోవచ్చన్న క్లాజ్ కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని ఆధారంగానే సుప్రీం కోర్టు చెప్పిన తర్వాత కూడా రెండు మూడు రాష్​ట్రాలు ఈ సీలింగ్‌ను తొలగించినట్లు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

ఇప్పుడు తెలంగాణలోనూ పంచాయతీ రాజ్ చట్టంలోని రిజర్వేషన్ల సీలింగ్‌ను తొలగిస్తేనే, 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకే గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపారు. అది క్లియర్ కాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వనున్నది. ఆ జీవో కేవలం లోకల్ బాడీ రిజర్వేషన్లపై మాత్రమే ప్రస్తావిస్తుంది. విద్యా, ఉద్యోగాల్లో మాత్రం తప్పనిసరిగా రాష్​ట్రపతి వద్ద ఉన్న బిల్లు క్లియర్ కావాల్సిందేనని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

తర్వాత ఏంటి?
తెలంగాణ అసెంబ్లీ తీర్మానం 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నది. అయితే, ఇది క్లియర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువేనని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రాజకీయ మైలేజ్ కోణంలో అప్రూవల్ ఇవ్వకపోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే, దీనిపై పార్లమెంట్, రాజ్యసభలో ఫైట్ చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. అంతేగాక వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంట్, రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీల మద్ధతునూ కూడగడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రకటించిన జనగణనకు తెలంగాణ డేటా మోడల్‌గా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. కానీ, కేంద్రం ఎలా స్పందిస్తుందనే దానికి ఉత్కంఠగా మారింది. అయితే, కేంద్ర 42 శాతం బిల్లుపై లైట్ తీసుకుంటే, ఢిల్లీలో పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లియర్‌గా చెప్పారు. గతంలో నల్లచట్టాలను తెచ్చినప్పుడు కూడా బీజేపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిందని, ప్రతిపక్షాలు తెచ్చిన ప్రెజర్‌తో వాటిని రద్ధు చేసుకున్నట్లు వివరించారు. ఇప్పుడు కూడా తమకు ప్రత్యేక స్ట్రాటజీ ఉన్నదని, తప్పనిసరిగా 42 శాతం రిజర్వేషన్‌ను ఒప్పిస్తామని సీఎం ధీమాతో ఉన్నారు.

 Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు