Loans to Women (imagecredit:twitter)
తెలంగాణ

Loans to Women: మహిళలకు గుడ్ న్యూస్.. రుణ ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!

Loans to Women: ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే గతేడాది కంటే ఎక్కువ రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. 2025-26 సంవత్సరానికి 19,727.05 కోట్ల రూపాయాలను బ్యాంకు లింకేజీ ద్వారా ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. అందుకు సంబంధించి వార్షిక నివేదికను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందించనున్నారు. రూ.1,639.05 కోట్లతో, 52,715 మహిళా సంఘాల్లోని మహిళలకు వ్యక్తిగత ఎంటర్ ప్రైజ్ రుణాలు లక్ష్యంగా నిర్ణయించారు.

1000 బ్యాంకు మేనేజర్లకు ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజి పైన శిక్షణ లక్ష్యంగా నిర్ణయించారు. మహిళా జీవనోపాదుల కల్పనపై 2600 మంది ఏపీఎం, సీసీలకు, అదే విధంగా 64 మంది అడిషనల్ డీఆర్డీఓ, డీపీఎంలకు శిక్షణ ఇవ్వనున్నారు. 1106 మహిళా జీవనోపాదుల కల్పనపై వ్యక్తిగత ఎంటర్ ప్రైజ్‌లపై శిక్షణ కల్పించి ఎంటర్ ప్రైజ్‌ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు.

నల్లగొండ జిల్లాలో 23,365 మహిళా గ్రూపులు

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 3,55,138 మంది మహిళా స్వయం సహాయకసంఘాలు ఉండగా అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. 23,365 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెండోస్థానంలో 20,093 సంఘాలు ఖమ్మంలో ఉన్నాయి. మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా 15679 గ్రూపులు ఉన్నాయి. అదే విధంగా వ్యక్తిగతంగా ఎంటర్ ప్రైజెస్ లు రాష్ట్రంలో 52715 ఉన్నాయి. వాటికి ప్రభుత్వం బ్యాంకుల నుంచి 1639.05 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులోనూ నల్లగొండ ప్రథమ స్థానంలో ఉంది. 3354 ఎంటర్ ప్రైజెస్ ఉన్నాయి. రెండో స్థానంలో ఖమ్మం 3012 ఎంటర్ ప్రైజెస్ ఉన్నాయి.

500 మందిని సఖీలుగా నియామకం

గత ప్రభుత్వాలు చేయని విధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త విధానానికి రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. మహిళా సంఘాల్లో యాక్టీవ్ గా పనిచేసేవారికి, చదువుకున్న వారికి బ్యాంకు సఖిలుగా నియమకం చేపట్టనుంది. వారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేయాలని భావిస్తుంది. అందుకు సంబంధించి మంత్రి సీతక్క సెర్ప్ వార్షిక నివేదిక సందర్భంగా వెల్లడించారు. గతేడాది 600 మందిని సఖిలుగా నియమించినట్లు మంత్రి వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 కార్యక్రమాలు

2024-2029 ఈ ఐదేళ్లలో స్వయం సంఘంలో ఉన్న ప్రతి మహిళను కోటీశ్వరాలిని చేయాలనే సంకల్పం.రూ.లక్ష కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు లక్ష్యం నిర్ణయం.15-18 ఏళ్ల వయస్సుగల బాలికలను “బాలికా సంఘాలు” ఏర్పాటు చేసి, ఆరోగ్యం, పోషణ, ప్రస్తుత సామాజిక పరిస్థితులు, డిజిటల్ మోసాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కల్పించడం. రూ. 110 కోట్ల వ్యయంతో, 22 జిల్లాలలో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం, ౩౩ జిల్లాల ఐడీఓసీల పరిధిలో, రాష్ట్ర సచివాలయములో, అన్ని పర్యాటక ప్రాంతాలలో, రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో, మున్సిపల్ కార్యాలయాలలో, కళాశాలలు, ఆసుపత్రులు మరియు పారిశ్రామిక పార్కులలో “మహిళా శక్తి” క్యాంటీన్ల నిర్వహణ.

Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. తెలంగాణలో భద్రతా చర్యలపై.. ముఖ్యమంత్రి సమీక్ష!

. ఇప్పటికే 32 జిల్లాలలో రూ.10 లక్షల విలవగల పీఎంఎంఎస్వై-సెర్ప్ సహకారంతో మొబైల్ ఫిష్ అవుట్ లెట్లను మంజూరు చేసింది. రాష్ట్రములోని 32జిల్లాల్లో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను 2030 సంవత్సరం వరకు ఏర్పాటు చేయాలనే లక్ష్యం. రాష్ట్రములోని ఎంఎంస్ ల ద్వారా 150 బస్ లను కొనుగోలు చేసి టీజీఎస్ ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. రూ.1.23 కోట్ల వ్యయంతో రాష్ట్రములోని 119 తాలుకాల్లో జిల్లా సమాఖ్యల ద్వార భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుని, నిర్వహణకు చర్యలు చేపట్టింది.

2024-25 సాధించిన ప్రగతి

బ్యాంకుల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,13,948 సంఘాలకు, రూ.20,069.80 కోట్లు రుణాలు మంజూరు చేయడం చేసింది. ఆర్థిక సంవత్సరం చివరినాటికి 3,76,025 సంఘాలపై రూ.26,103.15 వేల కోట్ల బ్యాంకు అప్పు కలిగి ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు 100 కి 98.60% బ్యాంకులకు తిరిగి చెల్లింపు చేసినట్లు తెలిపింది. 2,22,518 ఎస్హెచ్జీ మహిళలకు రూ. 4,41,186.00 లక్షల ఎంటర్ ప్రైజ్ రుణాలు మంజూరు. 2024-25 ఆర్థిక సం.లో 553 స్వయం సహాయక సంఘ మహిళలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఆర్థిక అక్షరాస్యత కార్యకర్తలుగా తయారు చేయడం జరిగింది.

19,75,560 స్వయం సహాయక సంఘ మహిళలకు గ్రామ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు. 12,775 గ్రామ సంఘాలలో మహిళలు, పురుషులకు మరియు నిరుద్యోగ యువతకు డిజిటల్ మోసాలపై అవగాహణ కల్పన. ప్రమాదవశాత్తు ఎస్హెచ్జీ సభ్యురాలు మరణించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించింది.రూ.220.62 కోట్లు వడ్డీ రాయితీని 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3,32,324 సంఘాలకు మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.518.66 కోట్లు వడ్డీ రాయితీని మహిళా సంఘాలకు చెల్లించినట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

Also Read: Patnam Mahender Reddy: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు.. చీఫ్ విప్ హామీ..

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్