Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా ఇవ్వండి
Thummala Nageswara Rao (imagecredit:twitter)
Telangana News

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

Thummala Nageswara Rao: రబీ సాగు సీజన్‌లో తెలంగాణ రాష్ట్రంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో రైతులకు సరిపడా ఎరువుల సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, డిమాండ్‌ను తట్టుకునేలా బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచడానికి, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎరువులలో అక్టోబర్ నుండి డిసెంబర్ నెల వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను అందించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, ఈ నిల్వలును డిసెంబర్ ఆఖరికి ఇంకా యెక్కువ మొత్తం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

ప్రత్యేకంగా లేఖల ద్వారా..

కేంద్ర ఎరువుల శాఖ ద్వారా డిసెంబర్ నెలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86000 మెట్రిక్ టన్నుల ఇప్పటికే కాకినాడ(Kakinada), కృష్ణపట్నం(Krishnapatnam), విశాఖపట్నం, తుత్తుకుడి, గంగవరం, కారైకాల్, జైగఢ్ వంటి వివిధ పోర్టులకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఈ నిల్వలను త్వరితగతిన రాష్ట్రానికి తరలించడం అత్యవసరం కాబట్టి, యూరియా(Urea) రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnaw) కి, అలాగే కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్‌వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్(Minister Sarbananda Sonowal) ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా లేఖల ద్వారా శనివారం అభ్యర్థించారు.

Also Read: Room Heater Safety: కొత్త హీటర్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ప్రభుత్వ సూచనలివే!

అధికారుల మధ్య సమన్వయం

యూరియా రవాణాకు అవసరమైన ఖాళీ రైల్వే రేకులను తక్షణమే కేటాయించడం, పోర్టుల వద్ద క్లియరెన్స్ మరియు హ్యాండ్లింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడం, యూరియా రవాణాకు ఇతర సరుకుల కంటే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణాలో ఆలస్యాలను నివారించడం వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్ర మంత్రులను కోరినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను కూడా పోర్టులకు పంపి, సంబంధిత అధికారులతో సంప్రదించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటున్నదని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్​ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

Just In

01

Panchayat Elections: ఓట్ల పండుగకు పోటెత్తుతున్న ఓటర్లు.. పల్లెల్లో రాజకీయ వాతావరణం

Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

Akhil Vishwanath: కేరళ స్టేట్ అవార్డు నటుడు అఖిల్ విశ్వనాథ్ కన్నుమూత.. 30 ఏళ్లకే..

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!