Telangana RTA ( image CREDIT: twitter)
తెలంగాణ

Telangana RTA: ఫ్యాన్సీ నెంబర్లకు రేట్లు ఫిక్స్‌.. ఆర్టీఏ ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం!

Telangana RTA: రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల రుసుముపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన ధరలను సవరిస్తూ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు 1989లోని 81వ రూల్‌ను సవరిస్తూ ఈ మేరకు జీవో నెంబర్ 77 జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్ల గరిష్ట ధర లక్షన్నరకు చేరింది. జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం, 9999 నెంబర్ కావాలనుకునే వారు ఇకపై లక్షా 50 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Telangana Tourism: మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

నెంబర్లు కావాలంటే రూ.50 వేలలు చెల్లించాలి 

గతంలో ఈ రుసుము కేవలం రూ.50 వేలుగా ఉండేది. ఇక, 1, 9 నెంబర్లకు ఇంతకు ముందు రూ.50 వేల రుసుము ఉండగా, ప్రస్తుతం దానిని లక్షకు పెంచారు. అదే విధంగా, 6666 నెంబర్ కావాలనుకున్నా కూడా లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. 99, 999, 3333, 4444, 5555, 7777 వంటి నెంబర్లు కావాలంటే రూ.50 వేలలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఫ్యాన్సీ నెంబర్లపై రుసుమును పెంచారు.

 ఆర్టీఏ వేలంపాట

మామూలుగా వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు రూ.6 వేలు కట్టాల్సి ఉంటుంది, ద్విచక్ర వాహనదారులు రూ.3 వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకున్న వారు www.transport.telangana.gov.in ద్వారా నిర్ణీత రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ, ఒకే నెంబర్‌కు ఒకటికన్నా ఎక్కువగా దరఖాస్తులు వస్తే వాటికి ఆర్టీఏ వేలంపాట నిర్వహిస్తుంది. ఈ వేలంపాటలో ఎవరు ఎక్కువ డబ్బుకు పాడుకుంటే వారికి ఆ నెంబర్‌ను కేటాయిస్తారు.

Also ReadTelangana Education: ప్రభుత్వం మరో సంచలనం నిర్ణయం.. కేజీబీవీల ఆధునీకరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

Just In

01

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం 123 కోట్లు: మంత్రి వాకిటి శ్రీహరి

Kolkata Test: కోల్‌కతా టెస్టులో భారత్ ఓటమి.. దక్షిణాఫ్రికా ఉత్కంఠభరిత విజయం

Cyber Crime: ఓరి నాయనా ఐటీ కమిషనర్‌కే టోపి పెట్టిన సైబర్ నేరగాళ్లు..40 వేలు స్వాహ..!

Cyber Crime: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ పేరుతో ఫేక్ ఖాతాలు

Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..