Telangana Tourism (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Tourism: మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Tourism: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చింది. ఐదేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని, లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించింది. అయితే, ప్రభుత్వం అంచనాలకు మించి పెట్టుబడులు వచ్చాయి.

పెట్టుబడుల ప్రవాహం

టూరిజంలో పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించడంతో అంచనాలకు ఎక్కువగానే పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే టూరిజం పాలసీ వచ్చిన తొలి ఏడాదిలోనే టూరిజం కాంక్లేవ్‌లోనే 31 ప్రాజెక్టులలో రూ.15,279 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వీటితో 19,520 మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. హైదరాబాద్‌తోపాటు వికారాబాద్, సాగర్, బుద్ధవనం, అమరగిరి, సోమశిల, అమ్రాబాద్ తదితర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దేశీయ, అంతర్జాతీయ డెవలపర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 14 పీపీపీ ప్రాజెక్టులు(రూ.7,081 కోట్లు) చేపట్టనున్నారు. 8,920 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ప్రైవేట్​ భాగస్వామ్యంతో 17 ప్రాజెక్టులను చేపట్టేందుకు పలువురు డెవలపర్లు ముందుకు రాగా రూ.8,198 కోట్లతో చేపట్టబోయే పనులతో సుమారు 10వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్‌ రిట్రీట్‌, వికారాబాద్‌లో తాజ్‌ సఫారీ, విన్యార్డ్‌ రిసార్ట్‌, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్లు ఉన్నాయి. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్‌ కాంటినెంటల్‌, సెయింట్‌ రీజిస్‌, ఒబెరారు హౌటల్స్‌ హైదరాబాద్‌కు రానున్నాయి. ఫిల్మ్‌ ఇన్‌ తెలంగాణ, మెడికల్‌ వాల్యూ టూరిజం (ఎంవీటీ) పోర్టల్‌ను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రారంభించింది.

Also Read: Mana Shankara Vara Prasad Garu: వైరల్‌ సెన్సేషన్‌.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!

ప్రాజెక్టుల వివరాలు

వికారాబాద్‌లోని అనంతగిరిలో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ట్రెక్కింగ్, సఫారీ, ఫారెస్ట్ రిసార్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. అదే విధంగా హిల్స్‌లో జెసామ్, జెన్ మేఘలతో జాయింట్ వెంచర్ వెల్నెస్ సెంటర్, వైన్ మేకింగ్ యూనిట్, గింజర్ హోటల్స్ నిర్మించనున్నారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అనంతగిరిలో 81 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,021 కోట్లతో లగ్జరీ ‘లా వీ వెల్‌నెస్ రిట్రీట్’ను నిర్మిస్తున్నది. మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో బుద్ధిస్ట్​ మిషనరీ మెడిటేషన్​ సెంటర్ ​ఏర్పాటు చేయనున్నదని టూరిజం అధికారులు తెలిపారు. థైవాన్ ఫోగువాంగ్ షాన్ సంస్థ కూడా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. హౌస్‌బోట్స్, వెల్నెస్ రిట్రీట్లు, కాన్వెన్షన్ సెంటర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కృష్ణా నది బ్యాక్‌ వాటర్స్‌లో సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్స్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చుట్టూ ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపడుతున్నారు. రామోజీ గ్రూప్ ఫిల్మ్ సిటీలో 600 ఎకరాల్లో కొత్త టూరిజం ఆకర్షణల కోసం రూ.2,000 కోట్లను పెట్టుబడి పెడుతున్నది.

వనపర్తి జిల్లాలో టైగర్ కంట్రీ..

హైదరాబాద్2లోని తారామతి బారదారి 5 స్టార్ హోటల్ గ్రూప్స్​ 7 ఎకరాల్లో మాట్నిక్ ఫిన్‌వెస్ట్ ఎల్‌ఎల్‌పీ నిర్మించనున్నది. సినిమా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ మాస్టా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీఎస్​‌యూఆర్‌లో 120 ఎకరాల్లో రూ.550 కోట్లతో ‘బాహుబలి థీమ్ పార్క్‌’ను నిర్మించనున్నది. రిధిరా లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్(Ridhira Living Private Limited) సంస్థ కోటిపల్లి దగ్గర రూ.487 కోట్లతో తాజ్ సఫారీతో ఎకో రిసార్ట్‌(Eco Resort)ను, యాచారంలో నోవోటెల్ వెల్‌నెస్ రిసార్ట్‌(Novotel Wellness Resort)ను ఏర్పాటు చేయనున్నది. వనపర్తి జిల్లాలో టైగర్ కంట్రీ(Tiger Country) కూడా ఎకో రిసార్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే, శంషాబాద్‌లో సిటాడెల్ హోటల్స్ రూ.500 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తుండగా టర్మినస్ గ్రూప్ అనంతగిరిలో రూ.700 కోట్లతో జేడబ్ల్యూ మారియట్ రిసార్ట్‌ను నిర్మిస్తున్నది.

మొయినాబాద్‌లోని చిలుకూరు ఎక్స్‌పీరియం గ్రూప్ రూ.750 కోట్లతో 5 స్టార్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా మారుస్తున్నాయి. వెల్‌నెస్, ఎకో టూరిజం, థీమ్ పార్కులు, ఎంఐసీఈ సౌకర్యాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి. ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధి, స్థానిక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. పర్యాటక రంగంలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని పెట్టుబడులు రావడం ఖాయమని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

Also Read: The Girlfriend- Jatadhara: ఫైడే విడుదలైన సినిమాల రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..

Just In

01

BRS Party: గులాబీ ఏజెంట్లతో రహస్య భేటీలు.. ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ డబ్బులు పంచుతోంది.. ఈసీ పట్టించుకోవట్లేదు.. హరీశ్ రావు ఫైర్

Cyber Security: తెలియని లింక్‌ల నుంచి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయడం ఎంత ప్రమాదకరమో తెలుసా?

Thorrur SC Boys Hostel: తొర్రూరు ఎస్సీ హాస్టల్‌లో వసతుల కొరత.. విద్యార్థుల అవస్థలు

OTT censorship in India: ఓటీటీల్లో వల్గారిటీ కంటెంట్ ఉన్నా సెన్సార్ ఎందుకు పట్టించుకోదు?.. రీజన్ ఇదే..