Reservation Finalisation: ప్రభుత్వం రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకెళ్తుంది. 50 శాతం పరిమితితో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో జనాభా ప్రకారం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు చేస్తున్నారు. సోమవారం ఒక్కరోజూ మాత్రమే గడువు ఉండడంతో పూర్తి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాలు, జిల్లాల్లో ప్రకటించారు. మిగిలిన వాటిని సోమవారం ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మినహా 31 జిల్లాల్లో
రాష్ట్రంలో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా మినహా మిగిలిన 31 జిల్లాల్లో స్థానిక సంస్థల నిర్వహించనుంది. రాష్ట్రంలోని 12,733 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,12,288 వార్డులు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. మండల యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన జిల్లాల్లో ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాను హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనరేట్లలో అందజేస్తున్నారు. రిజర్వేషన్లు పూర్తిచేసిన వారు వివరాలతో కూడిన నివేదికలను అందజేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులకు సూచించారు. అయితే, కొంతమంది మాత్రమే అందజేసినట్లు సమాచారం. అన్ని జిల్లాల నుంచి పూర్తి సమాచారం సోమవారం మధ్యాహ్నం వరకే అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం.
పకడ్బందీగా రిజర్వేషన్ల జాబితా
అధికారులు ప్రకటించే రిజర్వేషన్ల జాబితా పకడ్బందీగా చేస్తున్నట్లు సమాచారం. ఎస్టీ, ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు కులగణన సర్వే-2024’ ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించాలని జీవోలో ప్రభుత్వం పేర్కొనడం దాని ప్రకారం చేస్తున్నారు. వార్డులకు సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఎకనామిక్ క్యాస్ట్ సర్వే (ఎస్ఈఈఈపీసీ) 2024 ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళల రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేస్తున్నారు. అయితే, పూర్తి స్థాయిలో అధికారులు రిజర్వేషన్లు నివేదికను జిల్లాల వారీగా కమిషనరేట్లలో అందజేస్తున్నారు.
కలెక్టర్లు గెజిట్ విడుదల కాపీ
అన్ని జిల్లాల్లో రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్ విడుదల చేసిన కాపీని కమిషనరేట్లలో సోమవారం మధ్యాహ్నం వరకు అందజేయనున్నారు. అన్ని జిల్లాల వారీగా వచ్చిన నివేదికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సాయంత్రంలోగా అందజేయనున్నట్లు సమాచారం. అందుకోసం కమిషనరేట్ లో అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ సర్పంచ్, వార్డుల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నది. అయితే ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం.
Also Read: Kishan Reddy: హైదరాబాద్ సంస్థానానికి ఆయన కంటే గొప్ప చేసిందెవరు లేరు: కిషన్ రెడ్డి

