Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ఇక నుంచి ఉద్యోగులకు ప్రత్యేకంగా ప్రతి నెల రూ.500 కోట్లు కేటాయించేందుకు సర్కార్ రెడీ అయింది. జూన్ నుంచే ఈ స్పెషల్ ఫండ్స్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం, సంక్షేమానికి వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీని వలన ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలు క్రమంగా పరిష్కరించబడతాయని ప్రభుత్వం ఆలోచన. ఇదే అంశంపై గతంలో పలుమార్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఎంప్లాయిస్ సమస్యలు, వాటి పరిష్కారాలు, ఆర్ధిక సమకూర్పు వంటి అంశాలపై ఆరా తీశారు. ఏం చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చర్చించారు. ఆ తర్వాత సీఎం, ఇతర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగస్థులకు మంచి జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఉద్యోగుల హక్కులు, రాయితీలు వంటివి కూడా ఈ నిధులతో సాధించుకోవచ్చని వివరించారు.
Also Read: Kamal Haasan: కమల్ హాసన్‌కు సూపర్ ఛాన్స్.. సీఎం సపోర్ట్‌తో ఎంపీగా ఖరారు!
ఉద్యోగుల కీలక సమస్యలివి?
ప్రస్తుతం సుమారు రూ. 10 వేల కోట్లు ఉద్యోగుల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాటు ఐదు డీఏలు కూడా నిలిచిపోయాయి. ఇక పీఆర్ సీ నివేదిక ప్రకారం 51 శాతం ఫిట్ మెంట్‌ను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ ఎస్) ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని సర్కార్ పై ఎంప్లాయిస్ ప్రెజర్ పెడుతున్నారు. దీంతో పాటు జీవో 317 లో చాలా మంది ఉద్యోగులు తమ సొంత జిల్లాలు దాటి దూరంగా వెళ్లిపోయారు.
భార్య,భర్తలు వేర్వేరు జోన్లలో కేటాయించబడ్డారు. కనీసం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు పెట్టుకునే అవకాశం కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో సూపర్ న్యూమరరీ పోస్టులు కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన వాళ్లకు అవకాశం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇలాంటి ప్రధాన మైన సమస్యలకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించనున్న నిధులను ఉపయోగించనున్నారు.
Also Read: Rajendra Prasad: నేనెప్పుడూ జేబు నిండిందా? లేదా? అని చూడలేదు.. ఏం చూసే వాడినంటే?