CMD Musharraf Farooqui: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూనే ఉంది. దీంతో వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సన్నద్ధమవ్వడంపై విద్యుత్ సంస్థలు కసరత్తును ముమ్మరం చేశాయి. సమ్మర్ డిమాండ్ ను అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్ కో, డిస్కం అధికారులు భావిస్తున్నారు. రానున్న ఎండా కాలంలో డిమాండ్ ఏ స్థాయిలో పెరిగినా విద్యుత్ సరఫరా లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అక్టోబర్ చివరి నాటికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు చేపట్టడంపై మింట్ కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్(SPDCL) సంస్థ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో శుక్రవారం ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ(CMD Musharraf Farooqui) సమీక్ష నిర్వహించారు.
పెరుగుతన్న డిమాండ్..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిలో గరిష్ట డిమాండ్ 19,500 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు, గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో సైతం డిమాండ్ 5000 మెగా వాట్లకు చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ డిమాండ్ ను తట్టుకోవడానికి గాను దక్షిణ డిస్కం పరిధిలో 3,866 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, 431 పవర్ ట్రాన్స్ ఫార్మర్ల స్థాయి పెంచడం, అదనంగా ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు తెలిపారు. పెరుగుతన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ కో కు సంబంధించిన జూబ్లీ హిల్స్(Jublihills), మాదాపూర్(Madhapur), మణికొండ(Manikonda), గచ్చి బౌలి(Gachibowli), మేడ్చల్(Medchal), శివరాం పల్లి, పటాన్ చెరు, ఆర్సీపురం, బొల్లారం, బోరపట్ల, నర్సాపూర్, పలమాకుల సబ్ స్టేషన్లలో గల పవర్ ట్రాన్స్ ఫార్మర్ కెపాసిటీ పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్థలాల కొరతను అధిగమించడం కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాన్నే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సాంకేతికంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగానే సంస్థ పరిధిలో మొట్టమొదటిసారిగా 1000 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: Ration Rice Scam: రేతిరయ్యిందంటే రేషన్‌కు రెక్కలే.. యదేచ్చగా రేషన్ బియ్యం దందా..!
గరిష్ట కెపాసిటీ కలిగిన..
గ్రేటర్ హైదరాబాద్ నగరం లో 70 శాతానికి మించి లోడ్ ఎదుర్కొనే 500 కెవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో 1000 కేవీఏ కెపాసిటీ గల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అదేవిధంగా 33/ 11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో గల సబ్ స్టేషన్లలో గరిష్ట కెపాసిటీ కలిగిన 16 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్లు(పీటీఆర్) ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పెద్ద కెపాసిటీ కలిగిన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు వల్ల స్థలాల కొరత చాలా వరకు తగ్గుతుందని సీఎండీ వివరించారు. డిమాండ్ పెరగనున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులతో సమావేశమై క్షుణ్ణంగా పరిశీలించి ఒక వారం రోజుల్లో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దానికి తగినట్లుగా ఈనెల చివరి వరకు రిపేర్ అండ్ మెయింటనెన్స్ పనులకు సంబంధిచిన పనులు మొదలుపెట్టాలని సీఎండీ సూచించారు. ఈ పనులన్నీ డిసెంబర్ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో డైరెక్టర్లు సంపత్ కుమార్, లతా వినోద్, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు నరసింహులు, శివాజీ, ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్లు చిరంజీవి, వాసుదేవరావు, డిస్కం చీఫ్ ఇంజినీర్లు పాండ్య, నరసింహులు, శివాజీ, ట్రాన్స్ కో చీఫ్ ఇంజినీర్లు చిరంజీవి, వాసుదేవరావు, డిస్కం చీఫ్ ఇంజినీర్లు పాండ్య, నరసింహస్వామి, బాలస్వామి, ఆనంద్, కామేశ్, ప్రభాకర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Breakfast Scheme: ప్రభుత్వ స్కూళ్లలో టిఫిన్.. సర్కార్ కీలక నిర్ణయం!
