TG Gig Workers: గిగ్ వర్కర్ల ఫ్యూచర్ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామీ(Minister Gaddam Vivek Venkata Swamy) పేర్కొన్నారు. సోమవారం ఆయన గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగం వేగంగా మారిపోతోందని చెప్పారు. భారతదేశంలో 65 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో గిగ్ ఎకానమీ వేగంగా ఎదుగుతుందన్నారు. 2020–21లో 77 లక్షలుగా ఉన్న గిగ్ వర్కర్లు 2024–25లో 1.2 కోట్లకు చేరి, జాతీయ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం వాటా సాధించారని వివరించారు. 2029–30 నాటికి ఈ సంఖ్య 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నదన్నారు.
455 బిలియన్ డాలర్ల విలువ
ఈ రంగం ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థకు 455 బిలియన్ డాలర్ల విలువను జోడిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో సుమారు 4 లక్షల గిగ్ వర్కర్లు ఉన్నారని మంత్రి చెప్పారు. హైదరాబాదు(Hyderabada), వరంగల్(Warangal) కేంద్రాలుగా ఉన్న ఈ వర్గంలో 80శాతం మంది వయస్సు 18–40 మధ్య ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిలో 2024లో సీజీజీ చేసిన అధ్యయనం ప్రకారం 70 శాతం మంది బీసీ వర్గాలు, 21 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నట్లు రికార్డు చేసినట్లు తెలిపారు.
Also Read: Medak Police: మీ మొబైల్ పోయిందా? ఆందోళన చెందవద్దు.. అయితే ఇలా చేయండి : జిల్లా ఎస్పీ
ఉద్యోగ నిబంధనల లేక పోవడం
అయితే కార్మిక చట్టాల వర్తింపు లేకపోవడం,స్పష్టమైన ఉద్యోగ నిబంధనల లేక పోవడం సామాజిక భద్రత కు లోటు కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ మెకానిజం లేకపోవడంతో కంపెనీలు శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయన్నారు. అందుకే తాము తెలంగాణ ప్లాట్‌ఫార్మ్-బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్, 2025 ఆమోదం తెలిపామన్నారు. తద్వారా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడంతో పాటు కార్మికుల ఉద్యోగాలకు భద్రత కూడా లభిస్తుందన్నారు.
Also Read: CITU: కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తాం: తపన్ సేన్

