Endowments Department: దేవాదాయశాఖలో (Endowments Department) ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టింది. పోస్టులను గుర్తించి వాటి భర్తీకి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్థికశాఖ ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ నెలల తరబడి పెండింగ్ లో పెట్టింది. 410 పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. రాష్ట్ర దేవాదాయశాఖలో ప్రభుత్వం 1454 పోస్టులకు మంజూరు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 1043 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 410 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో జాయింట్ కమిషన్ కేడర్ పరిధిలో 302 పోస్టులకు గాను 178 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
Also Read: Medak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం
భర్తీకి మంత్రి సురేఖ ఆదేశాలతో చర్యలు
123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ కేడర్ లో 129 మంది ఉండాల్సి ఉండగా 103 మంది పనిచేస్తుండగా 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ కేడర్ లో 216 గాను 171 మంది పనిచేస్తుండగా 45 పోస్టులు ఖాళీగా, 6(ఏ) కింద 749 మంది ఉండాల్సి ఉండగా 584 మంది పనిచేస్తుండగా 165 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. 6(బీ) కింద 37 మందికి గాను 5 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 6(సీ) కింద 21 మందికి గాను 2 మాత్రమే పనిచేస్తుండగా 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జాయింట్ కమిషనర్ కేడర్ పరిధిలో సత్యాచార్య పోస్టులు 2, వేదపరాయణదాస్ పోస్టులు 2, అర్చక పోస్టులు 21, పరిచారక పోస్టులు 44, కుక్ పోస్టులు 3, అసిస్టెంట్ కుక్ పోస్టులు 32, డోలు పోస్టులు 5, సన్నాయి పోస్టులు 6, సృతి పోస్టులు 2, తాలం పోస్టు 1, సుప్రభాతం గాయకులు 1, హార్మోనిస్టు 2, మృదంగం పోస్టులు 1, లింగం వాచర్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 123 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటి భర్తీకి మంత్రి సురేఖ ఆదేశాలతో చర్యలు చేపట్టారు.
ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు సైతం పరిష్కారం
ఆర్థికశాఖకు దేవాదాయశాఖలో ఖాళీ పోస్టులు ఉన్నాయని భర్తీచేసేందుకు ఆర్థిక అనుమతి ఇవ్వాలని నాలుగైదు నెలల క్రితం పంపినట్లు సమాచారం. అయితే పలుమార్లు మంత్రి సురేఖ ఈ విషయంపై గుర్తుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ ఫైల్ కదలడం లేదని సమాచారం. ఆ ఫైల్ కు అనుమతి పొందితే ఎండోమెంట్ కు కొత్త ఉద్యోగులు రావడంతో పాటు శాఖ పటిష్టం కానుంది. ఆలయాల అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి. దీనికి తోడు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు సైతం పరిష్కారం లభించనుంది. ఇది ఇలా ఉంటే శాఖలో 410 పోస్టులు ఖాళీగా ఉండటంతో పనిచేస్తున్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది. దీంతో పైళ్లు ముందుకు సాగకపోవడంతో చేయాల్సిన పనులు పెండింగ్ లో పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. అయితే మంత్రి సురేఖ చొరవతో దేవాయదాయశాఖ గాడిలో పడుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆర్థికశాఖ ఎప్పటికవరకు అనుమతి ఇస్తుందో వేచిచూడాల్సిందే.
Also Read: Petal Gahlot: ఐరాసలో పాక్ ప్రధాని వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చిన భారత లేడీ ఆఫీసర్