Telangana Endowments Department (imagecredit:twitter)
తెలంగాణ

Telangana Endowments Department: తెలంగాణ దేవాదాయశాఖ కీలక నిర్ణయం

Telangana Endowments Department: దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆలయాలు 10లక్షలకు పైగా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనాలన్నీ ప్రభుత్వ అనుమతి తప్పని సరి చేసింది. సెక్షన్ 6(ఏ), 6(బీ) ప‌రిధిలోని టెంపుల్స్ అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆలయ పరిపాలనల్లో పారదర్శకత, జవాబుదారి తనం అని పైకి పేర్కొంటున్నప్పటికీ ప్రత్యేక్షంగా అధికారుల అధికారాలకు మాత్రం కోత పడింది.

రిలిజీయ‌స్ ఇనిస్టిట్యూష‌న్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆలయాల్లో పనుల పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ఆలయాల వార్షిక బడ్జెట్ కు ప్రభుత్వ అనుమతి తప్పని సరి అని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలిజీయ‌స్ ఇనిస్టిట్యూష‌న్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ – 1987(Hindu Religious Institutions and Endowments Act) ప్రకారం సెక్షన్ 6(ఏ), 6(బీ) ప‌రిధిలోని టెంపుల్స్ వార్షిక బ‌డ్జెట్ పై కీల‌క నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 6(ఏ) కింద 25లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలుగా, 6(బీ) కింద 2నుంచి 25లక్షల లోపు ఉన్న ఆలయాలు ఉన్నాయి.

Also Read: Ganja Gang Arrested: భాయ్ బచ్చా ఆగయా.. వంద మంది గంజాయి బాబుల గుట్టు రట్టు

ఈ ఆలయాలన్ని ప్రతి సంవత్సరం
20ఏళ్ల కింద లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6(ఏ) కింద మొత్తం 135 ఆలయాలు, 6(బీ)-301 ఆలయాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నూతనంగా టెంపుల్ క్లాసిఫికేషన్ చేపడితే సుమారు 10కి పైగా ఆలయాలు 6–ఏ లోకి రానున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్(Hyderabad) బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, పెద్దమ్మ టెంపుల్, కీసరగుట్ట, భద్రాద్రి, చెరువుగట్టు ఇలా మరికొన్ని ఆలయాలు 6–ఏ చేరనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఈవో(EO) అధికారి పనిచేస్తుండగా ఏసీ (అసిస్టెంట్ కమిషనర్) లేదా డీసీ (డిప్యూటీ కమిషనర్) ను నియమించనున్నారు. అయితే ఇక ఈ ఆలయాలన్ని ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ ను రూపకల్పన చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది. వారి ఆమోదంతోనే ఆలయాల్లో పనులు చేపట్టనున్నారు.

మంత్రి ప‌రిశీల‌న‌లో లేకుండా
ప్రస్తుతం ఈ బడ్జెట్‌లు పరిపాలనా అనుమతులకు అనుగుణంగా ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచకుండానే ఎండోమెంటు శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవ‌డం ప్రభుత్వం దృష్టికి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేప‌థ్యంలో ప్రజా ప్రతినిధులు, వారి నియోజ‌క‌వ‌ర్గాల్లోని టెంపుల్ కు మంత్రిని బడ్జెట్ కేటాయింపులు అడిగిన‌ప్పుడు.. కింది స్థాయిలోనే జ‌ర‌గ‌డంతోనే మంత్రి ప‌రిశీల‌న‌లో లేకుండా పోయింది. దీంతో స‌ద‌రు అధికారులు మంజూరు చేసిన పనులకు సంబంధించిన అంశాలను సమావేశాల్లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో మంత్రికి ఇబ్బంది కలుగుతోందని సమాచారం. దాంతోపాటు, దేవాల‌యాల‌ను స‌క్రమంగా నిర్వర్తించేందుకు తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలిజీయ‌స్ ఇనిస్టిట్యూష‌న్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ – 1987 సెక్షన్ 154 కింద ఇవ్వబడిన అధికారాలను ఉప‌యోగించి మంత్రి మ‌రింత పార‌ద‌ర్శకంగా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: RTC Employees Union: ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి ఇవ్వాలి.. ఎంప్లాయీస్ యూనియన్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అందుకే సెక్షన్ 6(ఎ), 6(బి) కిందకు వచ్చే దేవాలయాల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలన్నీ అనుమతి పొందే ముందు ప్రభుత్వానికి ఆమోదం కోసం అందజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆలయ వార్షిక బడ్జెట్ 10లక్షలకు మించి ఉంటే పరిపాలన అనుమతి తీసుకోవాల్సిందే. బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాతనే పనులు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం పరోక్షంగా జారిచేసినట్లు సమాచారం. ఈ ఆదేశాలు దేవాల‌య పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి బడ్జెట్ ఆమోదం, ప్రభుత్వ పర్యవేక్షణను అందించే చట్టంలోని సెక్షన్ 34, 154 ఉద్దేశ్యానికి అనుగుణంగా అని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.

అధికారుల అధికారాలకు కోత?
ఇప్పటివరకు దేవాదాయశాఖలో ఆలయాలకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఆయా ఆలయ అధికారులు రూపొందించి ఆక్కడి ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ ను ప్రతిపాదించి ఆమోదిస్తారు. దానికి అనుగుణంగా ఆలయ పరిధిలో అభివృద్ధి పనులు చేపడతారు. ప్రస్తుతం ఆలయ డిప్యూటీ కమిషనర్, కమిషనర్, ఆర్జేడీ స్థాయి అధికారులు బడ్జెట్ ను ఆమోదిస్తున్నారు. వారేఆలయాల్లో అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను దేవాదాయశాఖ కు అందజేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికారుల అధికారాలకు కోతపడింది. ఆలయాల అధికారులు తప్పనిసరిగా బడ్జెట్ ను ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపనున్నారు. వారు బడ్జెట్ కే ఓకే అంటేనే పనులకు మోక్షం కలుగనుంది. దీంతో కొంత పనుల జాప్యం కూడా జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి కొండా సురేఖ
ఆలయ పరిపాలనలో పాదర్శకత, జవాబుదారితనం పెంచేందుకే వార్షిక బడ్జెట్ ఆమోదం తప్పని సరి అనే నిబంధన తీసుకొచ్చాం. కొన్ని ఆలయాల్లో బడ్జెట్ లో జరుగుతున్న లోపాలను గుర్తించాం. ఆలయ సమీక్ష సమావేశాల్లోనూ ఆ ఆలయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయకపోవడంతో ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోతున్నాం. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని 10లక్షల వార్షిక బడ్జెట్ పెట్టే ప్రతి ఆలయ అధికారులు ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకోవాలి. దీంతో ప్రభుత్వ మానిటరింగ్ కూడా ఉంటుంది.

Also Read: CPI leader Murder: కుంట్లూరు భూదాన్​ భూముల్లో వేసిన గుడిసెల వివాదమే కారణం?

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు