RTC Employees Union: వాతావరణ కాలుష్యంతో పర్యావరణం దెబ్బ తినకుండా ఉండాలంటే డీజిల్(Diesel), పెట్రోల్(petrol) వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కేంద్ర ప్రభుత్వం సమర్థించటాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(RTC Employees Union) తీవ్రంగా ఖండించింది. మీడియా ప్రకటన విడుదల చేసింది. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.బాబు(Ram Babu), ఈదురు వెంకన్నమాట్లాడుతూ కేవలం ఆర్టీసీ బస్సుల వల్లనే పర్యావరణం దెబ్బతినడం లేదని, టూ వీలర్ దగ్గర నుంచి, సుమారు 60 లక్షల వాహనాలు తెలంగాణ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్న సందర్భంలో పర్యావరణం దెబ్బ తినడం లేదా అని ప్రశ్నించారు.
బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు సబ్సిడీ
ఆర్టీసి బస్సుల వల్ల కాలుష్యం కేవలం 0.09 శాతం మాత్రమేనని, మిగిలిన కాలుష్యమంతా ఇతర వాహనాలతోనే వస్తోందన్నారు. కాలుష్యం పేరుతో కార్పొరేట్ శక్తులకు సబ్సిడీ ఇచ్చి, బస్సులను తయారు చేయడం కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసి, ఆర్టీసి(RTC)లను నిర్వీర్యం చేయడమే అని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లకు సబ్సిడీ ఇచ్చి వారిని బాగు చేసే బదులు, అదే సబ్సిడీలు ఆర్టీసీకి ఇచ్చి వారి బాడీ బిల్డింగ్ యూనిట్లలో ఎలక్ట్రిక్ బస్సుల తయారయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read: YSRCP: ఇంటింటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలు!
మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు
ఇప్పటికే 600 ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీలో అద్దెబస్సులుగా రావడం వలన కొన్ని డిపోలు, గ్యారేజీలు ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం జరిగిందని, దీంతో ఆ డిపోల నుంచి వందలాది మంది సిబ్బంది బలవంతంగా బయటికి గెంటేశారని, రాను రాను ఈ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందున ఆ బస్సులను నేరుగా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే ఈ ప్రైవేట్ విద్యుత్ బస్సుల(Electric buses)ను అడ్డుకోవడానికి భవిష్యత్తులో కార్మికోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
Also Read: Gut health: వర్షాకాలంలో పెద్ద పేగు సమస్యలు ఎందుకు? నిపుణులు ఏమంటున్నారు?