Corn Farmers
తెలంగాణ

Corn Farmers: ఈ రైతుల కష్టం పగవారికి వద్దే వద్దు.. పట్టించుకుంటారా? లేదా?

Corn Farmers: ములుగు ఏజెన్సీలో మెుక్కజొన్న విత్తనాల మాఫియా చేస్తున్న దగాకోరు అక్రమాలపై ‘స్వేచ్ఛ’ ఇచ్చిన పరిశోధనాత్మక కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘ఏజెన్సీలో సీడ్ బాంబ్’ పేరుతో సరిగ్గా 14 రోజుల క్రితం (మార్చి 7) ఇచ్చిన తొలి కథనం.. అందరిని ఉలికిపాటుకు గురిచేసింది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని అంతర్జాతీయ సీడ్ కంపెనీలు ఎలాంటి దురగతాలకు పాల్పడుతున్నాయో స్వేచ్ఛ కళ్లకు కట్టింది. జన్యుమార్పిడికి గురైన విత్తనాలు వాడి ఆర్థికంగా నష్టపోవడం కాకుండా ఆ కుంకులు తిని పలువురు గిరిజనులు, ఆదివాసులు శవాలుగా మారిన వైనం ప్రతీఒక్కరిని కలిచివేసింది. ములుగు ఏజెన్సీలో ఇంత జరుగుతున్న నిన్నటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి విధానపరమైన చర్యలు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ములుగు ఏజెన్సీలో మరో రైతు ఆత్యహత్య చేసుకోవడం మరింత ఆందోళనకు దారి తీసింది.

ఆర్థికంగా కుదేలు

సాధారణంగా ములుగు ఏజెన్సీలో మెుక్కజొన్నను ఎక్కువగా పండిస్తారు. ఇది గమనించిన ఊరు పేరులేని పలు అంతర్జాతీయ కంపెనీలు.. ఇక్కడి అమాయకపు గిరిజన రైతులను టార్గెట్ చేశాయి. జన్యుమార్పిడి చేసిన మెుక్కజొన్న విత్తనాలను నిరాక్షరాస్యులైన ఆదివాసీలకు ఇచ్చి వారిచేత పంటలు పండిస్తోంది. ఎకరానికి రూ.50 వేలు పెట్టుబడి ఇస్తామని చెప్పి ఈ సీడ్ బాంబ్ ఊబిలోకి దింపింది. అయితే నాశిరకం విత్తనాలు కావడంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి గత మూడేళ్లుగా అక్కడి గిరిజన రైతులు మోసపోతూ వస్తున్నారు. ముందు చెప్పినట్లు పెట్టుబడి సాయం ఇవ్వమని సదరు విత్తనాల కంపెనీలని అడిగితే దిగుబడి లేదన్న సాకుతో రూ.10 వేలు మాత్రమే ఇస్తూ మరింత మోసం చేస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలు

నకిలీ విత్తన కంపెనీలను నమ్ముకొని ఆర్థికంగా దెబ్బతినడంతో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకూ అలా 8 మంది చనిపోగా తాజాగా ములుగు జిల్లా రైతు చిరుతపల్లి మధు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతేకాదు జన్యుమార్పిడికి గురై పండిన మెుక్క జొన్న కంకుల్లో సింజెంటా, హైటెక్, బేయర్ , మెరిక్యూరీ, లిడ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో వాటిని తిని మరో నలుగురు రైతులు అనారోగ్యంతో చనిపోయారు. ఆరుగురు పక్షవాతం బారిన పడగా.. 20 మంది రైతులు తీవ్ర అస్వస్థతతో మంచాన పడ్డారు. 20 పశువులు సైతం చనిపోయాయి.

Also Read: Seethakka Fires on Kavitha: ‘కరెప్షన్ మీ డీఎన్ఏలోనే ఉంది’.. బీఆర్ఎస్ పై సీతక్క ఫైర్

కేసుల పేరుతో బెదిరింపులు

విత్తన కంపెనీల ఆగడాలతో ఇప్పటికే సహనం నశించిన గిరిజనులు.. తాజాగా తమలోని మరో రైతు చనిపోవడంతో ఆందోళనకు దిగారు. అయితే నిరసనలు చేయవద్దని పోలీసులు వారిని అడ్డుకున్నారు. కంపెనీల నుంచి ఎకరానికి రూ.70-80 వేలు ఇప్పిస్తామని ఆర్డీవో రాయబారం నడుపుతున్నట్లు నిరసనకు దిగిన గిరిజన రైతులు ఆరోపిస్తున్నారు. లేనిపక్షంలో మావోయిస్టులు అన్న ముద్ర వేసి అరెస్టులు చేస్తామని అమాయకపు రైతులను హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంగాక నిరక్షరాస్యులైన గిరిజనులు భయందోళనకు గురవుతున్నారు.

సీతక్క రియాక్షన్

జన్యుమార్పిడి జరిగిన మెుక్కజొన్న విత్తనాలు కారణంగా తాజాగా ములుగు జిల్లా చిరుతపల్లి మధు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి సీతక్క సమగ్ర విచారణకు ఆదేశించారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలను తేల్చాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టవద్దని సూచించారు. వారిని చట్టపరంగా శిక్షించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?