Congress: తెలంగాణ కాంగ్రెస్ (congress) నేతలు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను (Ashwini Vaishnav) శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. ఈ సందర్భంగా… పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున వారు కేంద్ర మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy VenkatReddy), కొండా సురేఖ (Konda Surekha), సీతక్క(Seethakka), ఎంపీలు బలరాం నాయక్(Balaram Naik), చామల కిరణ్‌కుమార్ రెడ్డి(Chamala Kiran kumar reddy), కడియం కావ్య(Kadiam Kavya)… అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో అరగంట పాటు చర్చించామని, తాము నివేదించిన అంశాలపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వరంగల్‌కు రింగ్ రోడ్డు ఇస్తామన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాజీపేట డివిజన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వికారాబాద్ రైల్వే లైన్‌పై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే డోర్నకల్- భద్రాచలం రైల్వే లైన్ వంతెన నిర్మాణం గురించి కూడా చర్చించినట్లు తెలిపారు.
రాష్ట్రానికి మూడు బ్యాటరీ తయారు క్లస్టర్లు…
రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల(EV) కోసం బ్యాటరీలు తయారు చేసేందుకు మూడు క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఇవాళ మహబూబ్ నగర్(Mahboobnagar) జిల్లా దివిటిపల్లి (Divitipalli) వద్ద అమర్ రాజా(AmaraRaja) బ్యాటరీకి చెందిన ‘గిగా’ పరిశ్రమకు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో తయారీ రంగ యూనిట్స్ ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది ప్రధాని మోడీ (PM Modi) ఆలోచన అన్నారు. తెలంగాణలో 3 తయారీ రంగ క్లస్టర్స్(Battery Manufacturing Clusters) కి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అందులో ఒకటి దివిటిపల్లిలో ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ కంపెనీ అని, అక్కడికే భూమి పూజకు వెళ్తున్నానని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటుందన్నారు.
Also Read:
Actress: అన్నీ ఆత్మహత్య ఆలోచనలే వచ్చేవి: స్టార్ హీరోయిన్