Actress: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో దీపికా ఒకరు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే షారుఖ్ జోడిగా దీపికా నటించి ప్రశంసలు పొందింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా మూవీస్ చేస్తూ సందడి చేసింది. బచ్నా ఏ హసీనో, చాందిని చోవ్క్ టు చైనా, లవ్ ఆజ్ కల్, మైన్ ఔర్ శ్రీమతి ఖన్నా వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఛపాక్, గెహ్రైయాన్, బ్రహ్మాస్త్రం, సిర్కస్, పఠాన్, జవాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, యుద్ధ విమానం, కల్కి వంటి చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను దీపికా పెళ్లి చేసుకుంది. ఈ కపుల్‌కి ఇటీవలే ఒక కుమార్తె కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం కుమార్తె ఆలనాపాలనా దీపికా చూసుకుంటుంది. దీంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్స్‌లో దీపికా ఒకరు. ఒక్కో మూవీకి సుమారు రూ.20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఈ బ్యూటీ ఆస్తులు కూడా బానే కూడబెట్టిందని తెలుస్తుంది. ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్‌గా కూడా చరిత్ర సృస్టించింది. ‘సింగం అగైన్’ అనే చిత్రంలో చివరిసారిగా నటించింది దీపికా.
అయితే దీపికా ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకానొక సమయంలో అన్ని ఆత్మహత్యల ఆలోచనలు వచ్చేవి అని చెప్పుకొచ్చింది. 2014 తర్వాత తన జీవితం కుప్పకూలిందని, సమస్యలు వెంటాడాయని చెప్పింది. తాను ఆ సమయంలో ముంబైలో ఒంటరిగా ఉండేదాన్ని, అయితే తన సమస్యలను ఎవరితో షేర్ చేసుకోలేదని వెల్లడించింది. ఇదే సమయంలో తన తల్లి వచ్చినప్పడు గుక్కపట్టి ఏడ్చాను అని చెప్పుకొచ్చింది. ఆ రోజు తన బాధలను తల్లితో చెప్పానని, నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు జీవితంపై ఆశ లేదని, అప్పుడే అమ్మ మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చిందని చెప్పింది. ఆ తర్వాత సెట్ అయిపోయానని దీపికా చెప్పుకొచ్చింది. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు అనేవి జీవితంలో ఏదో ఒక చోట ఎదురవుతాయని తెలిపింది. వాటి గురించి బాధపడకుండా ముందుకు సాగాలని చెప్పింది.
మరోవైపు దీపికా ‘ఛపాక్’ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యాసిడ్ దాడి బాధితురాలిగా అద్భుతంగా నటించింది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపికా.. ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ.. ఆ చిత్రంలోని లుక్‌ను రీ-క్రియేట్ చేయమని అడిగింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే దీపికా కెరీర్‌లో మొత్తం 7 గురితో డేటింగ్ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఇందులో ఐదుగురు సినీ హీరోస్ ఉండగా.. ఇద్దరు క్రికెటర్స్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది.