CM Revanth Reddy ( image credit: swetha reporter)
తెలంగాణ

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంకల్పం.. కార్పొరేట్ తరహాలో సర్కారు బడులు

CM Revanth Reddy: ప్రతీ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించారు. పేద పిల్లలకు మెరుగైన విద్య అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్ప నకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్పై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతోపా టు మంచి వాతావరణం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకు విద్యా శాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని చెప్పారు.

Also Read: CM Revanth Reddy: సీఎంవో కార్యాలయం నుంచి అధికారుల లీకులతో ఇబ్బందులు.. సీరియస్‌గా తీసుకున్న సీఎం

అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలి

సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని అన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్స్ ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని చెప్పారు. అక్కడ కార్పొరే టీ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించా రు. విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, 2026 జూన్లో అకడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకె క్లాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also ReadCM Revanth Reddy: హాస్టళ్ల అత్యవసర ఖర్చులకు రూ.60 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..