bhatti
తెలంగాణ

Bhatti: ముగిసిన అఖిల పక్షం… డిప్యూటీ సీఎం కీలక పిలుపు

All party Mp’s Meeting:  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధ్యక్షతన ప్రజాభవన్‍(Prajabhavan)లో జరిగిన తెలంగాణ ఎంపీల సమావేశం ముగిసింది. సమావేశంలో భాగంగా… పలు హామీలపై చర్చించిన ఎంపీలు, కేంద్రం(Central) నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మెుత్తం 28 అంశాలపై చర్చించి ప్రతిపాదనలు రూపొందించారు. విభజన సమస్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌(PowerPoint Presentation) ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

పెండింగ్ సమస్యల సాధన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీని కోసం బీజేపీ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) లతో పాటు అందరు ఎంపీలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కస్వయంగా ఫోన్ చేసి పిలిచారని సమాచారం. అయితే.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఏనిమిది కాంగ్రెస్ వి కాగా, మరో ఎనిమిది బీజేపీవి. కాగా, అధికార పార్టీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ వస్తుందా, లేదా అని చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ చివర్లో తాము రావడం లేదంటూ కిషన్ రెడ్డి భట్టికి లేఖ రాశారు. ‘‘మాకు, మా పార్టీ ఎంపీలకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున హాజరుకాలేకపోతున్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనుకుంటే ముందస్తుగా తెలపండి’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ మీటింగ్ కు హాజరు కాలేదు. పార్టీ తరఫున వడ్డిపర్తి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఎంఐఎం తరఫున అసదుద్దీన్ హాజరయ్యారు.

ముఖ్యంగా ఈ మీటింగ్ లో… మెట్రో రెండో దశ(Metro Second Phase), మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్(Moosi River Project), బాపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం సహా పలు ప్రధాన అంశాలను చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే, వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల కోసం అభ్యర్థన,ఎస్‍సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, ఐపీఎస్ కేడర్ సమీక్ష తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. కాగా, ఈ అంశాలకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యేలా ఎంపీలు కృషి చేయనున్నారు.

Also Read: 

Kishan Reddy: రూ.18,700 కోట్లతో RRR ఉత్తర భాగం- శుభవార్త చెప్పిన కిషన్ రెడ్డి

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు