Kishan Reddy: తెలంగాణ(Telangan) అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 జాతీయ రహదారులను (National Highways) పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తెలిపారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ మేర నూతన జాతీయ రహదారులను నిర్మించినట్లు తెలిపారు. త్వరలోనే ఆ రహదారుల ప్రారంభానికి కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) వస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) గురించి కూడా ఆయనతో చర్చించామని చెప్పారు.
ఆరాంఘర్ (Aaramghar) నుంచి శంషాబాద్‌కు ఆరు లేన్ల హైవే పూర్తి అయిందని మంత్రి చెప్పారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)కు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ (Signal Free) రోడ్డు కూడా పూర్తి అయిందని వివరించారు. వచ్చే నెలలో బీహెచ్ఈఎల్ (BHEL) ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాబోతోందని అన్నారు. బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తయితే.. కూకట్‌పల్లి – పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా… ఆర్ఆర్ఆర్ (RRR) ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని ఇప్పటికే అంచనా వ్యయాన్ని అధికారులు సిద్ధం చేశారని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతున్నదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read:
Chiranjeevi: చిన్నప్పుడే ముగ్గురు తోబుట్టువులను కోల్పోయా: చిరంజీవి
Nara Lokesh: హిందీ వివాదంపై తెలుగు రాష్ట్రాలు తలో దిక్కు.. సీఎం రేవంత్ అలా.. మంత్రి లోకేష్ ఇలా!