Tummala Nageswara Rao: భారీ వర్షాల నేపధ్యంలో పంట నష్ట నివారణ పై జాగ్రత్తలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయాధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. సచివాలయంలో భారీ వర్షాలు, ఎరువుల సరఫరా పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు రేపటి వరకు 18వేల మెట్రిక్ టన్నుల యూరియా రైల్వే రాక్స్ ద్వారా 16 కంపెనీలు సరఫరా చేస్తున్నారని తెలిపారు. వారం రోజుల్లో మరో 21 వేల టన్నులు యూరియా పది రోజుల్లో మొత్తం 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనున్నారని వెల్లడించారు.
రైతులెవరు ఆందోళన పడొద్దు
దిగుమతి చేసుకున్న యూరియాలో కరయికల్ పోర్టు, తమిళనాడు నుంచి 10,800 మెట్రిక్ టన్నులు, దామెర పోర్టు, ఒడిస్సా(Odisha) నుంచి 8100 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టు నుండి 10,800 మెట్రిక్ టన్నులు అదనంగా కేటాయించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ లో అదనపు కేటాయింపుల కోసం జాయింట్ సెక్రటరిని ఢిల్లీ(Delhi)కి పంపించనున్నామని, రైతులెవరు ఆందోళన పడొద్దని సూచించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులు అనుసరించేలా యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. కూలీల సమస్యలు తగ్గాలన్నా.. అధిక దిగుబడులు సాధించాలన్నా వ్యవసాయ యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ పరంగా అందిస్తున్న సబ్సిడీలు రైతులకు తెలియజేయాలన్నారు.
Also Read: PM Modi – Trump: 4 సార్లు ఫోన్ చేసిన ట్రంప్.. మాట్లాడబోనన్న ప్రధాని మోదీ!
ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం
వ్యవసాయ శాఖ పరిధిలోని శాఖలతో పాటు కార్పోరేషన్ ల పరిధిలో ఉద్యోగుల హాజరు పై మంత్రి సమీక్షించారు. ఉదయం 10.40 వరకు కూడా కొందరు ఉద్యోగులు ఆలస్యంగా హాజరు అవ్వడం పై వివరణ తీసుకోవాలని ,మరుసటి రోజు ఆలస్యంగా వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణ గా జవాబుదారీగా ఉండాలని సూచించారు. సమావేశంలో కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.
Also Read: Viral Video: హైదరాబాద్‌లో ఆ ఏరియా చూసి.. నోరు పెద్దగా తెరిచి.. రష్యన్ గర్ల్ ఏం చేసిందంటే?