TDP: తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ..!
TDP (imagecredit:twitter)
Political News, Telangana News

TDP: తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పోటీ.. సర్వే చేయిస్తున్న చంద్రబాబు

TDP: తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీకి సిద్దమవుతుంది. అందుకోసం సర్వేలు నిర్వహిస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి సత్తాచాటాలని భావిస్తున్నది. పార్టీ కేడర్ లోనూ జోష్ నింపేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఏపీ మాదిరిగా కూటమితో వెళ్తుందా? సొంతంగా పోటీ చేస్తుందా? అనేదానిపై త్వరలోనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ నేతలతో భేటీ పోటీపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టీడీపీకి ఆదరణ ఉందా?

టీడీపీకి తెలంగాణలో కేడర్ ఉంది. కానీ పార్టీ అధ్యక్షుడిగా సరైన నేత లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు స్తంభించాయి. పార్టీ నేతలు, కేడర్ సైతం సైలెంట్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజభన తర్వాత చంద్రబాబు ఏపీపైనే ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణలో నాయకత్వ లేమి కొరబడింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయకపోవడంతో కేడర్ లో నైరాశ్యం నెలకొంది. అంతేకాదు పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లోనూ బరిలో దిగలేదు. అయితే తెలంగాణలోనూ పార్టీ కాపాడే ప్రయత్నాలు పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించినట్లు సమాచారం. అందులో భాగంగానే కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రాబోతుండటంతో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. ప్రజల్లో టీడీపీకి ఆదరణ ఉందా? పోటీ చేస్తే గెలుస్తామా? అనే వివరాలను పార్టీ నేతలతో తెలుసుకున్నట్లు తెలిసింది. సభ్యత్వ నమోదుకార్యక్రమాన్ని చేపట్టడం, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సైతం బాబుకు వివరించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో భాగంగానే జీహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాబిన్ శర్మ బృందంతో సర్వే

రాజకీయ విశ్లేషకుడు రాబిన్ శర్మతో టీడీపీ ఒప్పందంతో ముందుకు సాగుతుంది. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాబిన్ శర్మ బృందంతోనే సర్వే చేయించింది. వారి సూచనల మేరకు టీడీపీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై ఈ బృందంతోనే చంద్రబాబు కార్పొరేషన్లలో సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా జీహెచ్ఎంసీపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెరగడం 300 డివిజన్లు కావడంతో టీడీపీ కలిసి వస్తుందా? పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితో ముందుకు వెళ్తే కలిసి వస్తుందా? లేకుంటే ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలపై సర్వే చేస్తున్నారు.

Also Read: Seethakka: మేడారం జాతరకు వచ్చే భక్తులందరూ.. ఈ రూల్స్ తప్పనిసరి పాటించాలి : మంత్రి సీతక్క!

పట్టునిలుపుకోవడం కోసం..

తెలంగాణపై ఫోకస్ పెడతామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానే టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రణాళికల్లో భాగంగానే సర్వే చేయించి కార్పొరేషన్లలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ఈ మూడు కార్పొరేషన్లపైనే ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. ఇక్కడ పార్టీ ఉంటేనే తనకు లాభమని చంద్రబాబు నిర్ణయానికి వచ్చే పోటీచేస్తే రాబోయే ఫలితాలపై సర్వేను చేయిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కార్పొరేషన్లలో పట్టు సాధిస్తే మాత్రం టీడీపీకి రాబోయే కాలంలో పునర్ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

త్వరలోనే తెలంగాణ నేతలతో భేటి?

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడి అవకాశం ఉంది. అయితే టీటీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ సమయంలోనే పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది? జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ చేయబోతుంది? అసలు పోటీ చేస్తుందా? లేదా? ఒక వేళపోటీ చేస్తే పొత్తుతో వెళ్తుందా? ఒంటరిగానే పోటీ చేస్తుందా? అనే అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీ నిర్వహిస్తున్న సర్వే చర్చనీయాంశమైంది.

Also Read: Rice Mill Scam: పేదల బియ్యం కొట్టేసిన రైస్ మిల్లర్లకు ఇక దబిడి దిబిడే.. త్వరలోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?