HCA Controversy: టీ-20 ప్రీమియర్ లీగ్ భారీ అక్రమాలు
HCA Controversy ( IMAGE Credit: twitter)
Telangana News

HCA Controversy: టీ-20 ప్రీమియర్ లీగ్ పాలక మండలి నియామకంలో భారీ అక్రమాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన టీసీఏ!

HCA Controversy:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించిన తెలంగాణ టీ-20 ప్రీమియర్ లీగ్ పాలక మండలి నియామకంలో భారీ అక్రమాలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేసింది. సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి, అనర్హులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారని పేర్కొంటూ టీసీఏ ప్రతినిధులు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐకి)కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రకటన ప్రారంభం నుంచే చెల్లదని, ఇది నిబంధనల ఉల్లంఘనల పర్వమని టీసీఏ ఘాటుగా విమర్శించింది.

నిబంధనల ఉల్లంఘనపై ధ్వజం

టీసీఏ ప్రతినిధి ధరం గురువా రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, హెచ్‌సీఏ ప్రకటించిన పాలక మండలిలో ఏజీఎం ఆమోదం లేని సభ్యులు ఉన్నారని, ఇది నిబంధనలు 14, 15, 28లను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ మండలిలోని సభ్యులకు సంబంధించి ప్రయోజనాల ఘర్షణ స్పష్టంగా కనిపిస్తుందని ఫిర్యాదులో ఎత్తిచూపారు. సభ్యులైన సునీల్ అగర్వాల్, పార్థ సత్వలేకర్ల కుమారులు హెచ్‌సీఏ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇది రూల్ 38 ప్రకారం ప్రత్యక్ష నిబంధనల అతిక్రమణ అని పేర్కొన్నారు. అలాగే, ఇంటరిమ్ సీఈఓగా ఇమ్తియాజ్ ఖాన్ నియామకం కూడా చట్టబద్ధంగా ఎన్నికైన ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా జరగలేదని ఆరోపించారు.

Also Read: HCA Fund Misuse: హైకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని జగన్ మోహన్​ రావు.. వెలుగులోకి మరో సంచలనం..?

ఆగం రావు నియామకం చట్ట విరుద్ధం

బాంబే, తెలంగాణ హైకోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండగానే ఈ ప్రకటన చేయడం చట్టవిరుద్ధమని టీసీఏ వాదిస్తున్నది. జిల్లా ప్రతినిధిగా అగం రావును నియమించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన లీగ్ మ్యాచ్‌లకు ప్రతిపాదించిన గ్రౌండ్ యజమాని కావడం వల్ల ఆర్థిక ప్రయోజనాల ఘర్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రకటించిన పాలక మండలి 100 శాతం అనర్హమని, ఇది “చట్టబద్ధ అధికారం లేని కుమ్మక్కైన గుంపు” మాత్రమేనని టీసీఏ నిప్పులు చెరిగింది.

టీసీఏ ప్రధాన డిమాండ్లు

అక్రమంగా ప్రకటించిన పాలక మండలిని బీసీసీఐ తక్షణమే రద్దు చేయాలని టీసీఏ డిమాండ్ చేసింది. కోర్టు తీర్పులు వచ్చే వరకు హైదరాబాద్ నగరం వెలుపల తెలంగాణ క్రికెట్ వ్యవహారాల్లో హెచ్‌సీఏ జోక్యాన్ని నిలిపివేయాలని, నిరంతర రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న హెచ్‌సీఏపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. క్రికెట్ పరిపాలనలో పారదర్శకత లేకపోతే తెలంగాణ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే స్పందించాలని టీసీఏ విజ్ఞప్తి చేసింది.

Also Read: HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?

Just In

01

Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?

Bandla Ganesh: తిరుమలకు బండ్ల గణేష్ పాదయాత్ర.. ఎందుకో తెలుసా?

Medchal Police: హ్యాట్సాఫ్ పోలీస్.. దొంగతనాల నిందితుల పట్టివేత కేసుల్లో ఆ జిల్లానే టాప్!

AP News: చంద్రబాబు నోటివెంట మళ్లీ ఆ మాట… ఈ డ్రీమ్ ఎప్పుడు నెరవేరుతుందో?

Noida Tragedy: ‘నాకు చనిపోవాలని లేదు.. ప్లీజ్ రక్షించండి నాన్న’.. టెక్కీ ఆఖరి మాటలు!