Fake Certificates: అమెరికా వెళ్ళాలన్న ఆశ..
Fake Certificates( iamge cedit: swetcha reporter)
Telangana News

Fake Certificates: అమెరికా వెళ్ళాలన్న ఆశ.. బెడిసికొట్టిన ప్లాన్!

Fake Certificates: నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ఇద్దరిని సౌత్​ ఈస్ట్​ జోన్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వేర్వేరు వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫస్ట్​ లాన్సర్ సయ్యద్​ నగర్​ నివాసి మహ్మద్​ ఖాదర్​ ఎలియాస్​ జునైద్​ (27) బిటెక్​ చదువుతూ మధ్యలో వదిలేశాడు. అయితే, అమెరికా వెళ్లి స్థిరపడాలన్న కోరికతో మహ్మద్​ ఖాదర్​ తలాబ్​ కట్ట అమాన్​ నగర్​ నివాసి, హోం ట్యూటర్​ అయిన సయ్యద్​ ఇమ్రాన్​ ఎలియాస్​ ప్రొఫెసర్​ (40)ను సంప్రదించాడు. తనకు ఏదైనా డిగ్రీ సర్టిఫికెట్​ ఇప్పించాలని అడిగాడు.

Also Read: Phone Tapping Case: ఇక ప్రభాకర్ రావు వంతు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూసుకుపోయిన దారులు!

ఈ క్రమంలో సయ్యద్​ ఇమ్రాన్​ అతని నుంచి 80వేల రూపాయలు తీసుకుని ఝాన్సీలోని బుందేల్​ ఖండ్​ వర్సిటీ నుంచి బీబీఏ చదివినట్టుగా సర్టిఫికెట్​ ఇచ్చాడు. ఈ క్రమంలో మహ్మద్​ ఖాదర్​ సర్టిఫికెట్లు కావాలనుకున్న మరికొందరిని కూడా సయ్యద్​ ఇమ్రాన్​ వద్దకు తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు మాసాబ్​ ట్యాంక్​ నెహ్రూ చాచా పార్క్​ వద్ద నకిలీ సర్టిఫికెట్లు ఇస్తుండగా సమాచారాన్ని సేకరించిన సీఐ సైదాబాబు, మాసాబ్​ ట్యాంక్​ సీఐ ప్రవీణ్​ కుమార్​ తోపాటు ఎస్సైలు కవియుద్దీన్​, సాయిరాం, మధు, సతీష్​ లతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి వేర్వేరు వర్సిటీలకు చెందిన 36 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్..సెక్రటేరియట్ లో సమావేశానికి రైతులకు పిలుపు!

సయ్యద్​ ఇమ్రాన్​ ను విచారించగా తన వద్దకు ఎవరైనా సర్టిఫికెట్లు కావాలని వస్తే వారి నుంచి డబ్బు తీసుకుని వివరాలను ఢిల్లీ నజఫ్​ ఘడ్​ నివాసి రోహన్​ ఎలియాస్​ శ్యాంలాల్​ కు వాట్సాప్​ ద్వారా పంపించేవాన్నని చెప్పాడు. రోహన్​ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి తనకు కొరియర్ ద్వారా పంపించే వాడని తెలిపాడు. ఈ క్రమంలో పోలీసులు రోహన్​ పై కూడా కేసులు నమోదు చేశారు. అరెస్ట్​ చేసిన మహ్మద్​ ఖాదర్​, సయ్యద్​ ఇమ్రాన్​ లను తదుపరి దర్యాప్తు నిమిత్తం మాసాబ్​ ట్యాంక్​ పోలీసులకు అప్పగించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?