Indiramma houses (imagecredit:swetcha)
తెలంగాణ

Indiramma houses: స్వేచ్ఛ ఎఫెక్ట్.. జోరందుకున్న ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలు

మెదక్ బ్యూరోస్వేచ్ఛ: Indiramma houses: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మెదక్ జిల్లాలో నత్తనడక న పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర హౌసింగ్ డీ.ఎం గౌతం మెదక్ జిల్లా వెనుకబడిందన్న నేపధ్యంలో మెదక్ జిల్లా లో విస్తృతంగా పర్యటించారు. స్వేచ్చ లో వచ్చిన కథనానికి గృహనిర్మాణ శాఖ ఎండి గౌతమ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో మెదక్ మండలం బాలానగర్ గ్రామంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై అవగాహన కల్పించారు. ఈ జిల్లాలో1555 ఇండ్లు మంజూరి కాక. టెక్నికల్ శాంక్షన్ 1242 కే మంజూరు ఇచ్చారు. జిల్లాలో కేవలం 188 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేవలం 33 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణాలు జరిగాయి.

దీంతో హౌసింగ్ డీ.ఎం గౌతం మెదక్ జిల్లాలో పర్యటించి, అధికారులతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడిప్పుడే లబ్ధి దారుల్లో ఆవాహన ఏర్పడి, ముగ్గుపొసుకొని పనులు ప్రారంభించు కొంటున్నారు. అధికారుల కొరత, ఉండడం గతంలో ఈ శాఖలో పని చేసిన అధికారులు తిరిగి ఈ శాఖలోకి రాకపోవడంతో పనులు పర్యవేక్షించే అధికారుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. సంగారెడ్డి,సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్లు వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నిర్మాణాలు పరిశీలించడం, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం చేస్తున్నారు.

ఇక్కడ హౌసింగ్ అధికారి జిల్లా కార్యాలయమే కేటాయించ లేదు. ఇప్పటి వరకు స్వేచ్ఛ ఉమ్మడి జిల్లాలో నీ సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మంజూరైన జాబితా, సంఖ్య, గ్రౌండ్, అయినవి, బెస్మెట్ స్థాయిలో నిర్మాణాల పై ప్రత్యేక కథనం ఇవ్వడం అందులో మెదక్ జిల్లా వెనుక బడి పోవడం, కథనంలో పేర్కొంది. ఇదే కాకుండా, గూడు లేని గృహ నిర్మాణ శాఖ, పాత గృహనిర్మాణ శాఖ, భవనం, వివాదం తదితర కథనాలను స్వేచ్ఛ రాసింది. హౌసింగ్ డీ.ఎం గౌతం 5 రోజుల క్రితం మెదక్ కు చేరుకొని క్షేత్ర స్థాయిలో పర్యటన చేశారు.

Also Read: Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇద్దరు మృతి

మెదక్ మండలం బాలానగర్ గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. హౌసింగ్ డీ.ఎం గౌతం పర్యటనలో మాత్రం జిల్లా స్తాయి అధికారులు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, హౌసింగ్ డీ.ఎం మాణిక్యంలు ఉన్నారు. బాలానగర్ గ్రామంలో లబ్ధిదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్, పాల్గొన్నారు.  అసలు జిల్లా కలెక్టరేట్ లో హౌసింగ్ కార్యాలయం, లేకపోవడం, ఈ శాఖ పై సమీక్షలు లేకపోవడంతోనే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వెనుకబడి పోయాయి అనేది వాస్తవం.

ఉన్న పాత హౌసింగ్ కార్యాలయంతో పాటు ఖాళీ స్థలం ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణానికి కలెక్టర్ కేటాయించడం తో పాటు, ఎంపీపీ కార్యాలయం లో ఉన్న మాజీ ఎంపిపి ఛాంబర్ ను హౌసింగ్ జిల్లా కార్యాలయంగా కొనసాగించుతున్నారు. దీనికి తోడు,క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలించేందుకు సరిపడే అధికారులు, లేనందున ఇళ్ల నిర్మాణాలలో కొంత జాప్యం జరుగుతుంది.
సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మాత్రం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలో 2,267 ఇందిరమ్మ ఇళ్లు మంజూరి కాగా 533 ఇండ్ల నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 80 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేశారు. ఇక్కడ కలెక్టర్ చొరవతో మండలానికి ఒక ఏఈనీ టెక్నికల్ పనుల కోసం వినియోగించుకుంటున్నారు.అందుకే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1114 ఇందిరమ్మ ఇళ్లు మంజూరి కాగా 293 ఇండ్లు పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో 43 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణాలు పూర్తి అయ్యాయి.

మెదక్ జిల్లాలో మాత్రం 1,555 ఇందిరమ్మ ఇళ్లు మంజూరి కాగా 1242 ఇండ్లు కు మాత్రమే టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు. ఇందులో 178 ఇండ్లు నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. కేవలం 32 ఇండ్లకు సంబంధించి బేస్ మీద వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. అది కుడా హౌసింగ్ డీ.ఎం వస్తున్నారని అప్పటికప్పుడు నిర్మాణాలు డీ.ఈ లబ్ధిదారుల దగ్గర ఉండి పూర్తి చేయించారు.
లబ్దిదారులు నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయండి..డబ్బులు ఖాతాలో వేస్తాం..

హౌసింగ్ డీ ఎం గౌతం.. 

మెదక్ మండలం బాలానగర్ గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎంత తొందరగా ఇండ్లు పూర్తి చేసుకుంటే అంత తొందరగా ఇండ్ల బిల్లులు మంజూరి చేస్తాం నేరుగా మీ ఖాతాల్లోకి వస్తాయి. నిధులకు డోకా లేదు. ఆలస్యము అవుతే మీకే రెట్లు ఎక్కువగా అవుతాయి తొందరగా ఇళ్ళు కట్టుకోండి అని లబ్ధి దారుల కు చెప్పారు. అనంతరం మెదక్ కలెక్టర్ లో అధికారులతో హౌసింగ్ ఎండి గౌతమ్ సమీక్ష జరిపారు. ఆలస్యం చేయకుండా మంజూరైన లబ్ధిదారుల తో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు.

కలెక్టరేట్ లోనే కార్యాలయం కేటాయిస్తామన్నారు.  మెదక్ జిల్లా కలెక్టరేట్ లో నే హౌసింగ్ కార్యాలయం కేటాయిస్తామని కలెక్టర్ చెప్పినట్లు హౌసింగ్ జిల్లా అధికారి మాణిక్యం తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో కార్యాలయ కేటాయిపు కోసం చర్యలు తీసుకుంటున్నారని స్వేచ్చ ప్రతినిధికి హౌసింగ్ డీ ఎం మాణిక్యం చెప్పారు.జిల్లాలో 178 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని,33 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణాలు అయ్యాయని తెలిపారు.

Also Read: TG Cabinet Expansion: మంత్రి వర్గ విస్తరణపై వీడని సస్పెన్స్.. ఈ కారణాలే ఆటంకంగా మారాయా?

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు