Swetcha Effect (imagecredit:swetcha)
తెలంగాణ

Swetcha Effect: ధరూర్ మండల పిఎసిఎస్ సెంటర్ పై కలెక్టర్‌కు ఫిర్యాదు..?

Swetcha Effect: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పిఎసిఎస్(PACS) సెంటర్ లో జరుగుతున్న అక్రమాలపై ఆ సంఘం డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ సంతోష్(Collector Santosh) కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆ సొసైటీ అధికారి అవినీతి అక్రమాలపై ఇప్పటికే స్వేచ్ఛ దినపత్రిక(Swetcha Daily News) ఆయన అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. సొసైటీ సమావేశంలో కార్యకలాపాలపై చర్చించి తీర్మాన రికార్డులో వివిధ అంశాలు రాసి సంఘం సభ్యుల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా కేవలం ఖాళీ పేపర్లపై సంబంధిత సంఘం డైరెక్టర్ల సంతకాలు తీసుకోవడంపై పిఎసిఎస్ సీఈవో(PACS CEO) సంబంధిత సంఘం కార్యకలాపాలలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్టిగేజ్, క్రాప్ లోన్లు(Crop loans), సొసైటీ పరిధిలో వచ్చే పలు రకాల లోన్ల విషయంలో ఆ అధికారికి చేయి తడిపితే పని అవుతుందని లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతారని ప్రజల ఆరోపిస్తున్నారు.

Also Read: Rare Disorder: ఓర్నాయనో.. ఇదేం వింత జబ్బురా అయ్యా.. మనుషుల ముఖాలు దెయ్యాల్లా కనిపిస్తాయట!

నామమాత్రంగా పాలకవర్గం

ధరూర్ పీఏసిఎస్ పాలకవర్గం నామమాత్రం ఉండటంతో అంతా సీఈఓ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధరూర్ పీఏసిఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు 11 మంది డైరెక్టర్ లున్నారు. పీ.ఏ.సి.ఎస్ సెంటర్ లో వ్యాపార లావాదేవీలు పీ.ఏ.సి.ఎ.స్ పాలక వర్గానికి తెలియకుండానే జరుగుతున్నట్లు పాలకవర్గం డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు. ఏదైన అడిగితే సమాధానం చెప్పేవారు కరువయ్యారని, కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని సంబంధిత అధికారికి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. సొసైటీ కార్యకలాపాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు డైరెక్టర్లు కోరుతున్నారు.

Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఎంత కష్టం!.. అయినా అవేం పనులు భయ్యా

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు