Supreme Court | బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పది మంది బీఆర్ ఎస్ (brs) ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ (congress) లో చేరడంతో వారిపై ఈ కేసు విచారణ జరుగుతోంది. నేడు ఎలాంటి తీర్పు వస్తుందో అని అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బీఆర్ ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత ధర్మాసనం తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనే ఆశతో బీఆర్ ఎస్ నేతలు ఉన్నారు.
ఇప్పటికే ఈ కేసుపై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు కూడా వర్తిస్తుందనే ఆశతో బీఆర్ ఎస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడేలా చూడాలని బీఆర్ ఎస్ కోరుతోంది.
అదే జరిగితే కాంగ్రెస్ కు పెద్ద ఝలక్ ఇచ్చినట్టు అవుతుందని వాళ్లు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ ఎస్ తీరును విమర్శిస్తోంది. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఇదే పని ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి నేడు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో.