Tremors in Vikarabad: వికారాబాద్ జిల్లాలో కంపించిన భూమి
Earth-Quake (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Tremors in Vikarabad: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. ఆందోళనకు గురైన జనం

Tremors in Vikarabad: భూకంపం (Earth Quake) వార్తతో వికారాబాద్ జిల్లా గురువారం (Tremors in Vikarabad) ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలోని పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో ఒక్కసారిగా భూమి కంపించింది. సెకన్‌ పాటు భూప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రకృతి చర్యతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. తీవ్ర భయాందోళన చెందారు. ప్రకంపనలను గమనించిన పలువురు గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. భూకంపం కారణంగా ప్రకంపనలు వచ్చాయని గ్రహించి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

కాగా, భూకంపాలు ప్రకృతి సహజంగా సంభవిస్తుంటాయి. మనం చూస్తున్నట్టుగా భూమి ఉపరితలం ఒకే పెద్ద పొరగా ఉండదు. అనేక టెక్టానిక్ ప్లేట్లుగా విభజించబడి ఉంటుంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదలాడుతూ ఉంటాయి. ఒకదానితో మరొకటి ఢీకొనడం, వేరుపడడం లేదా పక్కకు సర్దుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ కదలికల వల్ల ప్లేట్ల అంచుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలై భూమి కంపిస్తుంది.

Read Also- Congress 2014 defeat: కాంగ్రెస్ ఓటమికి సీఐఏ, మొస్సాద్ కుట్ర.. కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అయితే, భూకంపాలకు టెక్టానిక్ ప్లేట్ కదలికలు మాత్రమే కారణం అని చెప్పలేం. అగ్నిపర్వత ప్రాంతాల్లో భూమి లోపలి నుంచి లావా పైకి రావడం, వాయువులు ఒత్తిడిని పెంచడంతో చిన్న, పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. ఇవి సాధారణంగా అగ్నిపర్వతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇక, భూగర్భ కందకాలు, గుహలు కూలిపోవడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూమిలో సహజంగా ఏర్పడే గుహలు, గనులు కూలడంతో ఇవి సంభవిస్తాయి.

కొన్నిసార్లు మానవ చర్యలు కూడా కారణమవుతుంటాయి. భారీగా నీటిని నిల్వ చేసే డ్యాం లు, భూగర్భంలో మైనింగ్ బ్లాస్ట్‌లు జరపడం, పెట్రోల్–గ్యాస్ తవ్వకాలు వంటి కార్యకలాపాలు కూడా భూమిలో ఒత్తిడిని చహుసీ చిన్న భూకంపాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. భూగర్భంలో ఉష్ణోగ్రత, రసాయన మార్పులు జరుగుతాయని, ఇవి కూడా కొంత భౌగోళిక ఒత్తిడి మార్పులకు కారణమవుతుంటాయని అంటున్నారు.

Read Also- Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్ ఎప్పుడంటే?

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!