Lenin V Toppo: నాణ్యతలేని, కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ టోప్పో హెచ్చరించారు. మంగళవారం కేసముద్రం మండల కేంద్రంలోని ఓలం బస్వరాజం ఎరువుల దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణంలో ఉన్న ఎరువుల స్టాక్ వివరాల రిజిస్టర్‌ను, ఆన్‌లైన్ ద్వారా కేటాయించిన స్టాక్ వివరాలు, ఎరువుల గడువు తేదీలను స్వయంగా పరిశీలించారు.
Also Read: Gadwal District Collector: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు ఉపాధ్యాయులకు సూచనలు
ప్రస్తుత సీజన్‌కు అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని, కృత్రిమ కొరత సృష్టించకూడదని డీలర్లకు స్పష్టం చేశారు. రైతుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించి, విక్రయించిన ప్రతి ఎరువుకు తప్పకుండా బిల్లు ఇవ్వాలని సూచించారు. అలాగే, దుకాణం ముందు ఎరువుల స్టాక్ వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
