SRH HCA Dispute (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

SRH HCA Dispute: సన్ రైజర్స్ టికెట్ల వివాదంలో బిగ్ ట్విస్ట్.. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అరెస్ట్

SRH HCA Dispute: హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్… సన్​ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) మధ్య తలెత్తిన వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక నేపథ్యంలో సీఐడీ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​ ప్రెసిడెంట్ జగన్మోహన్​ రావుతోపాటు బాడీ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

వివాదానికి కారణం ఏంటంటే?
ఐపీఎల్​ మ్యాచ్​ సమయంలో టిక్కెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​ అధ్యక్షుడు జగన్మోహన్​ రావు (Jagan Mohan Rao)తోపాటు బాడీలోని మరికొందరు సభ్యులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారని సన్​ రైజర్స్​ హైదరాబాద్ మేనేజ్ మెంట్​ ఆరోపించిన విషయం తెలిసిందే. అడిగినన్ని టిక్కెట్లు ఇవ్వలేదని తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని సన్​ రైజర్స్ మేనేజ్​ మెంట్ ఆరోపించింది. అవసరమైతే హైదరాబాద్​ నుంచి మారిపోతామని కూడా అప్పట్లో స్పష్టంగా ప్రకటించింది.

సీఎం సీరియస్.. విచారణకు ఆదేశం
సన్ రైజర్స్, హెచ్ సీఏ మధ్య చెలరేగిన టికెట్ల వివాదం తీవ్ర దుమారం రేపడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో సీరియస్ అయ్యారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని విజిలెన్స్​ విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సన్​ రైజర్స్​ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాజీకి వచ్చారు. ఈ మేరకు తమ మధ్య రాజీ కుదిరినట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. సన్​ రైజర్స్​ మేనేజ్ మెంట్ ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

10శాతం టికెట్లకు డిమాండ్
అయినా జరిగిన వివాదంపై విజిలెన్స్​ అధికారులు విచారణ కొనసాగించారు. దీంట్లో హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షునిగా ఉన్న జగన్మోహన్ రావు అదనపు టిక్కెట్ల కోసం సన్​ రైజర్స్​ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకువచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. అప్పటికే సన్​ రైజర్స్​ మేనేజ్​ మెంట్​ స్టేడియం కెపాసిటీలో 10శాతం టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నా మరో 10శాతం టిక్కెట్లను వ్యక్తిగతంగా ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేసినట్టుగా విచారణలో నిర్ధారణ అయ్యింది. అదనంగా మరో 10శాతం టిక్కెట్లు ఇచ్చేది లేదని సన్​ రైజర్స్ ఫ్రాంచైజీ స్పష్టం చేసిననట్టుగా వెల్లడైంది. హైదరాబాద్ క్రికెట్​ అసోసియేషన్​ ద్వారా రిక్వెస్ట్ పెడితే టిక్కెట్లు ఇస్తామని చెప్పినట్టుగా తేలింది.

Also Read: Mothevari Love Story: ‘మోతెవరి లవ్ స్టోరీ’.. టైటిలే ఇలా ఉంది.. ఇక సిరీస్ ఎలా ఉంటుందో?

ఇబ్బంది పెట్టింది నిజమే!
హెచ్ సీఏ ద్వారా రిక్వెస్ట్ పంపాలన్న సన్ రైజర్స్ ప్రతిపాదనకు జగన్మోహన్ రావు అసహనం వ్యక్తం చేసినట్లు కమిటీ విచారణ తేలింది. ఈ నేపథ్యంలో మ్యాచ్​ ల సందర్భంగా సన్ రైజర్స్​ ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురి చేసినట్టుగా స్పష్టమైంది. లక్నో మ్యాచ్​ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేసినట్టుగా తేలింది. ఈ క్రమంలోనే విజిలెన్స్​ అధికారులు హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ పై చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. తాజాగా జగన్మోహన్ రావు తదితరులను అరెస్ట్ చేశారు.

Also Read This: Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు